close
Choose your channels

Bigg Boss Telugu 7 : టాస్క్‌ల్లో అర్జున్ దూకుడు.. కొట్టాడంటూ ప్రశాంత్‌ లొల్లి, వెదవ సోదీ  అంటూ ఇచ్చిపడేసిన అంబటి

Thursday, December 7, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ తుది అంకానికి చేరుకుంది. మరికొన్ని రోజుల్లో సీజన్ ముగియనుంది. అర్జున్ అంబటి ఫినాలే అస్త్ర గెలిచి .. ఈ సీజన్‌కు తొలి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఇంట్లో చిల్ పార్టీ పేరుతో టాస్క్‌లు పెడుతున్నాడు బిగ్‌బాస్. దీనిలో గెలిచిన వాళ్లకు ప్రేక్షకులను ఓటు కోసం అప్పీల్ చేసుకునే అవకాశం వుంటుందని చెప్పాడు. నిన్న శోభాశెట్టి టాస్క్‌ల్లో గెలిచి ఓటు కోసం అప్పీల్ చేసుకునే ఛాన్స్ అందుకుంది. ఇప్పటి వరకు బిగ్‌బాస్ తెలుగు టైటిల్‌ను అమ్మాయిలు గెలవలేదని, తాను గెలవాలని అనుకుంటున్నానని, ఈ ప్రైజ్ మనీ తన కుటుంబానికి ఎంతో ముఖ్యమని శోభాశెట్టి చెప్పింది.

నిన్న అమర్‌దీప్‌కు ఇచ్చినట్లే ఇవాళ అర్జున్‌కు కూడా కేక్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. కేక్‌ను పంపిస్తున్నానని, దానిని తను పూర్తిగా తనగలిగితే మిగిలిన ఇంటి సభ్యులకు కూడా కేక్ లభిస్తుందని దాదాపు 2 కిలోల కేక్ పంపించి షాకిచ్చాడు. హౌస్‌మేట్స్ అతనిని ప్రోత్సహించినప్పటికీ ఆ కేక్‌ను తినలేక నానా కష్టాలు పడ్డాడు అర్జున్. ఇంతలో యావర్‌ను ఆ టాస్క్‌లో భాగం పంచుకోమని చెప్పడంతో ఇద్దరూ కలిసి కేక్‌ను పూర్తి చేశారు. తర్వాత ‘‘చెర్రీ ఆన్ ద టాప్’’ అని ఓ గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా చెర్రీ పండు పడిపోకుండా ఇసుకతో చేసిన కేక్ ఒక్కొక్కరు కట్ చేయాలని చెప్పాడు. ఈ టాస్క్‌లో యావర్, అర్జున్, శివాజీ, ప్రియాంక తప్పుకోగా.. అమర్‌దీప్ విజేతగా నిలిచాడు.

అనంతరం రెండో టాస్క్ గురించి వివరించాడు బిగ్‌బాస్. ‘‘ ఓటు అప్పీల్ ఛాన్స్ సాధించేందుకు సెకండ్ కంటెండర్‌గా నిలవడానికి ఇంకో గేమ్ పెడుతున్నట్లు చెప్పాడు. దీనిలో భాగంగా బజర్ మోగినప్పుడు ఎవరైతే అక్కడ పెట్టిన బెల్ ముందుగా ఎవరు మోగిస్తారో .. వారికే అవకాశం దక్కుతుందని చెప్పాడు. అయితే అందరికంటే ముందుగా అర్జున్ బెల్ కొట్టాడు. కానీ పరిగెత్తే క్రమంలో అర్జున్ తనను టచ్ చేశాడంటూ రైతుబిడ్డ గొడవ పెట్టుకున్నాడు. నాకు ఇక్కడ తాకింది, అక్కడ తాకింది అంటూ సంచాలకుడికి కంప్లయంట్ చేశాడు. అది విని అర్జున్‌కు కోపం వచ్చింది.. తాను తోయలేదని సీరియస్ అయ్యాడు.

అయితే కాసేపటికీ సైలెంట్ అయిన ప్రశాంత్.. నాకేం తగలలేదని, అర్జున్ ముందుకు వెళ్లకూడదనే తానే వెనక్కి లాగబోయానని చెప్పాడు. సెకండ్ టాస్క్ కూడా గెలవడంతో అర్జున్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి రెండు గిన్నెలు ముందు పెట్టాడు. అందులో ఒక దాని మూత తీసి చూడగా మూడు ఉల్లిపాయలు కనిపించాయి. ఇవి తింటారా లేదంటే మరో గిన్నెలో ఏమున్నాయో చూస్తారా అని అడిగాడు. అయితే అర్జున్ మాత్రం మూడు ఉల్లిపాయలు తింటానని చెప్పాడు. చెప్పినట్లుగానే మూడు ఉల్లిపాయలు తినేసి ఓటు అప్పీల్‌ను , అమర్‌దీప్‌తో పోటీ పడే కంటెండర్ అయ్యాడు. ఇకపోతే.. ఈ వారం అర్జున్ తప్పించి శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, శోభాశెట్టిలు నామినేషన్స్‌లో వున్నారు. మరి వీరిలో ఎలిమినేట్ అయ్యేదెవరు..? గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టేదెవరు అనేది మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.