close
Choose your channels

‘ఒరేయ్‌.. బుజ్జిగా’ షూటింగ్ పూర్తి. ఏప్రిల్ 3న విడుదల

Saturday, January 18, 2020 • తెలుగు Comments

‘ఒరేయ్‌.. బుజ్జిగా’ షూటింగ్ పూర్తి. ఏప్రిల్ 3న విడుదల

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 3 న విడుదల చేయనున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ ”మా ఒరేయ్ బుజ్జిగా షూటింగ్ పూర్తయింది. రాజ్‌ తరుణ్‌ ఎనర్జీకి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దర్శకులు కొండా విజయ్‌కుమార్‌గారు డిఫరెంట్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 3 న చిత్రాన్ని విడుదల చేయనున్నాం.  తప్పకుండా మా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Get Breaking News Alerts From IndiaGlitz