close
Choose your channels

Odiyamma:'ఒడియమ్మా'.. నాని కోసం పాట పాడిన తమిళ హీరో..

Tuesday, November 28, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న' చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. శృతిహాసన్, నాని ఈ పాటలో నటించారు. 'ఒడియమ్మా హీటు... ఈడీఎంలో బీటు...' అంటూ సాగే ఈ గీతాన్ని తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్, శృతిహాసన్ పాడటం విశేషం. ఇక ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా.. హేషామ్ అబ్దుల్ వాహెబ్ సంగీతం అందించారు.

ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో నాని, తన కూతురు జీవితంలోకి హీరోయిన్ మృణాల్ వచ్చినట్టు చూపించారు. ఇక తన కూతురుకు అమ్మ గురించి తన గతం చెప్పడం.. ఇందులో శృతిహాసన్‌ను చూపిస్తూ సస్పెన్‌ క్రియేట్ చేశారు. అసలు నాని.. శృతిహాసన్‌ను పెళ్లి చేసుకున్నాడా..? చేసుకుంటే ఎందుకు విడిపోయారు..? మధ్యలో నాని జీవితంలోకి మృణాల్ వచ్చాక ఏమైందనే అంశాలతో ట్రైలర్ ఆసక్తిగా కట్ చేశారు. దీంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది.

నాని 30వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చెరుకూరి వెంకట మోహన్, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత 'సరిపోదా శనివారం' సినిమాలో నాని నటిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.