close
Choose your channels

కొత్త రంగంలోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్ ?

Saturday, November 9, 2019 • తెలుగు Comments

కొత్త రంగంలోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్ ?

హీరోగా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ స్టార్ హీరోగా కొన‌సాగుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొత్త ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఇంత‌కూ ఆయ‌న కొత్త రంగంలోకి అడుగు పెడుతున్నార‌ని సినీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. ఇంత‌కు ఎన్టీఆర్ అడుగు పెడుతున్న కొత్త రంగ‌మేంటో తెలుసా?  చిత్ర నిర్మాణ రంగం. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా సినిమాల్లో న‌టించడం, అడ‌పా ద‌డ‌పా క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించిన యంగ్ టైగ‌ర్ ఇక‌పై  సినిమాల నిర్మాణ రంగంలో భాగం కావాల‌నుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న నిర్మాణ సంస్థ‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ని టాక్‌.

సీనియ‌ర్ రామ‌కృష్ణా స్టూడియోస్‌ను స్థాపించి సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఎన్‌బీకే ఫిలింస్ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశారు. అలాగే ఎన్టీఆర్ అన్న క‌ల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌ను స్థాపించి సినిమాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే నంద‌మూరి కుటుంబంలో మూడు బ్యాన‌ర్‌లుండ‌గా ఎన్టీఆర్ మ‌రో బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేస్తాడ‌ని త్వ‌ర‌లోనే వాటి వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయ‌ని టాక్‌. ఇప్ప‌టికే ప్ర‌భాస్ యు.వి.క్రియేష‌న్స్‌, రామ్‌చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌ని, మ‌హేష్ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ను స్టార్ట్ చేశారు. అంద‌రూ సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ఇప్పుడు వీరి బాట‌లోకి ఎన్టీఆర్ కూడా అడుగు పెడుతున్నాడు. మ‌రి ఈ విష‌యం స‌స్పెన్స్‌కు క్లారిటీ రావాలంటే మ‌రికొన్ని ఆగాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz