close
Choose your channels

డాక్ట‌ర్‌తో ప్రేమ‌లో ఉన్న నిఖిల్‌

Sunday, October 13, 2019 • తెలుగు Comments

డాక్ట‌ర్‌తో ప్రేమ‌లో ఉన్న నిఖిల్‌

మంచు ల‌క్ష్మి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న షో `ఫీట్ అప్ విత్ ది స్టార్స్`. ఇందులో సినీ సెల‌బ్రిటీలు వారి బెడ్ టైమ్ స్టోరీస్‌తో పాటు వారి వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా బాహాటంగానే చెబుతున్నారు. తాజాగా ఈ రియాలిటీ షో లో యువ క‌థానాయ‌కుడు నిఖిల్ పాల్గొన్నాడు.

ఈ షోలో త‌న ల‌వ్ గురించి నిఖిల్ చెబుతూ ``నా జీవితంలో ఆ అమ్మాయి చాలా స్పెష‌ల్‌. త‌ను న‌న్ను బాగా అర్థం చేసుకుంది. నేను సినిమా షూటింగ్‌లో ఉన్న‌ప్పుడు కానీ.. స్నేహితుల‌తో స‌ర‌దాగా ఉన్న‌ప్పుడు త‌ను న‌న్ను డిస్ట్ర‌బ్ చేయ‌దు. నువ్వు స‌ర‌దాగా ఉండాలంటే ఉండు అని నాతో చెబుతుంది. త‌ను న‌న్ను బాగా అర్థం చేసుకుంది. అదే నాకు బాగా న‌చ్చింది. నాకు ప్రేమ పెళ్లిపై ఆస‌క్తి పెర‌గ‌డానికి కార‌ణం నేను షారూక్ సినిమాల‌ను బాగా చూడ‌ట‌మే`` అని చెప్పింది.

ప్ర‌స్తుతం నిఖిల్ ..చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ 2 సినిమా కోసం రెడీ అవుతున్నారు. త‌ను న‌టించిన అర్జున్ సుర‌వ‌రం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.

Get Breaking News Alerts From IndiaGlitz