close
Choose your channels

Avinash Reddy:అవినాష్ రెడ్డికి ఉపశమనం .. పచ్చ మీడియా కడుపు మంట, లైవ్ డిబేట్‌లో ఏకంగా జడ్జిలపైనే ఆరోపణలు

Tuesday, May 30, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ విచారణ, సాక్షుల వాంగ్మూలం, వైఎస్ సునీతా రెడ్డి పిటిషన్ నేపథ్యంలో అందరి వేళ్లూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అతని తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఇప్పటికే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ .. అవినాష్‌ను కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. పలుమార్లు సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి.. తల్లి అనారోగ్యం కారణంగా తాజా విచారణకు గైర్హాజరయ్యారు. నాటి నుంచి హైడ్రామా మొదలైంది. టీడీపీ అనుకూల మీడియా ఆయనను టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తోంది. రేపో మాపో అవినాష్ అరెస్ట్ ఖాయమంటూ రకరకాల కథనాలను వండి వార్చింది. అవినాష్‌ను అదుపులోకి తీసుకునేందుకు కేంద్ర బలగాలు కర్నూలుకు బయల్దేరాయంటూ వార్తలు రాసింది.

సీబీఐపై హైకోర్ట్ ప్రశ్నల వర్షం :

ఈ పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అవినాష్, వైఎస్ సునీత, సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. A2 నిందితుడు అవినాష్ ఇంట్లో ఉన్నారని ఎలా చెప్తున్నారు, ఆధారాల సేకరణకు ఎందుకు ఆలస్యమయ్యిందని న్యాయమూర్తి ప్రశ్నించారు. లోక్‌సభ అభ్యర్ధిత్వం కోసమే వివేకా హత్య జరిగిందని ఎలా చెప్తున్నారని ధర్మాసనం నిలదీసింది. లోక్‌సభ అభ్యర్థిగా అవినాష్‌ను అనధికారికంగా ముందే ప్రకటించారని మీ ఛార్జీషీట్లో చాలా మంది స్టేట్మెంట్లు ఉన్నాయి కదా అని అడిగింది. అవినాష్ అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించిన స్టేట్ మెంట్లు ఉన్నాయి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది.

అవినాష్ ఫోన్ సీజ్ చేయకుండా నిద్రపోతున్నారా :

అవినాష్‌ది చాలా బలమైన కుటుంబ నేపథ్యమని మీరే అంటున్నారని.. అలా అయితే 2017 ఎమ్మెల్సీ ఎన్నికలను మేనేజ్ చేసి ఉండొచ్చు కదా అని న్యాయమూర్తి నిలదీశారు. వివేకాను చంపాల్సిన అవసరం అవినాష్ కుటుంబానికి ఏముందని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటప్పుడు అవినాష్ ఫోన్ స్వాదీనం చేయకుండా నిద్ర పోతున్నారా , చూస్తుంటే సీబీఐ అనుమానాస్పదంగా వ్యవహరిస్తోంది అనిపిస్తోందని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. రెండు రోజుల విచారణ అనంతరం అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. ఆయన ముందస్తు బెయిల్‌పై వచ్చే బుధవారం తుది తీర్పును వెలువరిస్తామని.. అప్పటి వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ సీబీఐకి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాదిపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.

హైకోర్టు తీర్పుపై ఏబీఎన్‌లో లైవ్ డిబేట్ :

అయితే హైకోర్టు తీర్పు అలా వచ్చిందో లేదో టీడీపీ అనుకూల ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్ మొదలైపోయింది. ప్రముఖ యాంకర్‌ వెంకట కృష్ణ హోస్ట్‌గా ఈ చర్చ కార్యక్రమం మొదలైంది. దీనికి మాజీ జడ్జి రామకృష్ణ, బీజేపీ నేత విల్సన్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ జడ్జి రామకృష్ణ మాట్లాడుతూ.. తీర్పును తప్పుబట్టారు. బుధవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అని పెద్ద రిలీఫ్ ఇవ్వడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇలాంటి తీర్పు ఇచ్చారంటే ఖచ్చితంగా సదరు న్యాయమూర్తి ముడుపులు తీసుకున్నారని రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామ మాట్లాడుతూ.. హైకోర్ట్ నిర్ణయం సుప్రీంకోర్ట్ తీర్పుకు విరుద్ధమన్నారు.

ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ అంటోన్న నెటిజన్లు :

దీంతో ఈ చర్చా కార్యక్రమంపై వైసీపీ శ్రేణులు, నెటిజన్లు భగ్గుంటున్నారు. వాళ్లకు అనుకూలంగా న్యాయస్థానాల్లో తీర్పులు వస్తే కోర్టులు నిజాయితీగా పనిచేసినట్లు.. అదే వ్యతిరేకంగా వస్తే కోర్టులు, న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేస్తారంటూ చురకలంటిస్తున్నారు. ఇది వివేకా హత్యపై చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తోన్న పచ్చ మీడియా స్క్రిప్ట్ షో అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.