close
Choose your channels

చివరి నిమిషంలో న‌వీన్ చంద్ర సినిమా టైటిల్ మార్పు

Thursday, July 2, 2020 • తెలుగు Comments

చివరి నిమిషంలో న‌వీన్ చంద్ర సినిమా టైటిల్ మార్పు

న‌వీన్ చంద్ర హీరోగా శ్రీకాంత్ నాగోతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘భానుమ‌తి రామ‌కృష్ణ‌’. స‌లోని లుథ్రా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా జూలై 3న ఆహాలో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. అయితే టైటిల్ విష‌య‌మై కాంట్ర‌వ‌ర్సీ నెల‌కొంది. సీనియ‌ర్ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ త‌న‌యుడు భ‌ర‌ణి టైటిల్‌ను మార్చాలంటూ కోర్టుకు వెళ్లాడు. అయితే ట్రైల‌ర్‌లో తాము సినిమా కంటెంట్ దేనికి సంబంధించిందో తెలియ‌జేశామ‌ని, తమ సినిమాకు, భానుమ‌తికి సంబంధం లేద‌ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేస్తూ వ‌చ్చారు. అయితే కార‌ణాలు తెలియ‌లేదు కానీ.. రేపు విడుద‌లన‌గా చివ‌రి నిమిషంలో టైటిల్‌ను మార్చారు.

ఇప్పుడు భానుమ‌తి కాస్త‌.. భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌గా మారింది. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్ మరార్ స‌మ‌ర్ప‌ణ‌లో క్రిషివ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై య‌శ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ డిఫ‌రెంట్ ల‌వ్ జ‌ర్నీని శ్రీకాంత్ నాగోతి తెర‌కెక్కించారు. సాయిప్ర‌కాశ్ ఉమ్మ‌డి సింగు సినిమాటోగ్ర‌ఫీ, శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం హైలెట్‌గా నిలుస్తున్నాయి. క్ష‌ణం ఫేమ్ ర‌వికాంత్ పేరెపు ఈ చిత్రాన్ని ఎడిట్ చేయ‌డం విశేషం.

Get Breaking News Alerts From IndiaGlitz