close
Choose your channels

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నరసింహన్‌!

Monday, August 5, 2019 • తెలుగు Comments

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నరసింహన్‌!

కేంద్రలో రెండోసారి అధికారం దక్కించుకున్న నరేంద్ర మోదీ.. జమ్మూ కాశ్మీర్‌ను మూడు ముక్కలు చేసేసింది. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆర్టికల్ 370, 35A రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకూ ఉన్న జమ్మూ-కాశ్మీర్ మూడు ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూ, కాశ్మీర్, లఢక్ అనే మూడు ప్రాంతాలుగా మోదీ సర్కార్ విడగొట్టేసింది.!. దీంతో కాశ్మీర్ స్వయంప్రతిపత్తి కోల్పోయినట్లయ్యింది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే..!

అయితే జమ్మూకు లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు..? ఆ సీటు ఎవరికి దక్కుతుంది..? అనే చర్చ జరుగుతున్న క్రమంలో ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్.. ప్రస్తుత తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను జమ్మూ కాశ్మీర్‌కు పంపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా.. ఈయన గతంలో కేంద్ర ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉంది. దీంతో ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్‌ను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ నెలాఖరులోగా నరసింహన్ బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

నరసింహన్ ది రికార్డ్!

ఆయన జమ్మూకు వెళ్లనున్న నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలను త్వరితగతంగా పరిష్కరించాలని గవర్నర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ రాష్ట్ర విభజన సమస్యలపై వరుస భేటీలవుతున్నారని సమాచారం. కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన కృష్ణకాంత్ కంటే ఎక్కవ కాలం పని చేసిన గవర్నర్‌గా నరసింహన్ చరిత్ర సృష్టించారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిసెంబర్ 27, 2009లో నరసింహన్ గవర్నర్‌గా నియామకమయ్యారు. ఆ తర్వాత జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా గత నెల జూలై 16వ తేదీ వరకు వ్యవహరించారు. ఇటీవల ఏపీకి కొత్త గవర్నర్ భిశ్వభూషణ హరించందన్ రాగా.. త్వరలోనే తెలంగాణకు కూడా కొత్త గవర్నర్‌కు కేంద్రం నియమించనున్నది.

Get Breaking News Alerts From IndiaGlitz