close
Choose your channels

నారప్ప కూడా షురూ చేయ‌బోతున్నాడు...!

Sunday, October 18, 2020 • తెలుగు Comments

నారప్ప కూడా షురూ చేయ‌బోతున్నాడు...!

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌స్తుతం త‌మిళ చిత్రం ‘అసుర‌న్‌’ తెలుగు రీమేక్ ‘నార‌ప్ప‌’లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి వెంక‌టేశ్ జ‌త‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మూడు వంతులు షూటింగ్ పూర్త‌య్యింది. మిగిలిన పార్ట్‌ను చివ‌రి షెడ్యూల్‌గా కంటిన్యూగా చిత్రీక‌రించ‌నున్నార‌ని టాక్‌. కోవిడ్ వ‌ల్ల ఆగిన ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే రీస్టార్ట్ కానుంది. న‌వంబ‌ర్‌లో ఈ సినిమా మిగిలిన షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

ఈ సినిమాలో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వెంక‌టేశ్ స‌ర‌స‌న మ‌రో హీరోయిన్ న‌టించ‌నుంది. ఆ హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. రాయ‌ల‌సీమ ప్రాంతంలో భూవివాదాలు, కుల వివ‌క్ష‌ల‌ నేప‌థ్యంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. డి.సురేష్‌బాబు, క‌లైపులి థాను ఈ చిత్రానికి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మిగిలిన షూటింగ్‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz