కర్నూలు జిల్లాలో లోకేష్ పర్యటన


Send us your feedback to audioarticles@vaarta.com


కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. మంత్రాలయం స్కూల్ గ్రౌండ్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వీళ్లలో జనసేన నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు.
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఇటీవల కుంభమేళాకు వెళ్లడంతో పాటు, కాశీని కూడా సందర్శించారు లోకేష్. ఇప్పుడు కర్నూలులో ఆయన ఆధ్యాత్మిక పర్యటన సాగింది.
మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్ర స్వామి మఠంలో గురు వైభవోత్సవాలు ఘనంగా జరిగాయి. నారా లోకేష్ గురువైభవోత్సవంలో పాల్గొన్నారు. ఉండవల్లి నుంచి మంత్రాలయం చేరుకున్న నారా లోకేశ్ కు శ్రీమఠం అధికారులు, తెదేపా నాయకులు ఘనం స్వాగతం పలికారు.
ఉత్సవంలో భాగంగా మొదటి రోజు పాదుకా పట్టాభిషేకం నిర్వహించారు. ఇందులో నారా లోకేశ్ పాల్గొన్నారు. అనంతరం స్వామి ఉపయోగించిన బంగారు పాదుకలకు పీఠాధిపతి విశేష పూజలు నిర్వహించి, మంగళ హారతులు ఇచ్చారు. తర్వాత లోకేష్ కు గురువైభవోత్సవం అవార్డును ప్రదానం చేసి సత్కరించారు.
మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన వాళ్లలో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎంఎల్ఏ కెఈ శ్యాంబాబు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com