close
Choose your channels

నాని.. చివ‌ర‌కు త‌ప్ప‌ేలాలేదు...!!

Thursday, August 13, 2020 • తెలుగు Comments

నాని.. చివ‌ర‌కు త‌ప్ప‌ేలాలేదు...!!

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం.. థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టం, షూటింగ్స్ ఆగిపోవ‌డం ఏక కాలంలో జ‌రిగాయి. ప‌రిస్థితులు స‌ర్దుకోక‌పోయినా, క్ర‌మంగా సినీ ఇండ‌స్ట్రీ ప‌నిపై ఫోక‌స్ పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది. కానీ థియేట‌ర్స్ విష‌యంలో మాత్రం ఇంకా ఓ క్లారిటీ మాత్రం రావ‌డం లేదు. ఇప్ప‌టికే కొంద‌రు నిర్మాత‌లు చేసిన సినిమాల‌ను డిజిట‌ల్ మాధ్య‌మాల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ఎట్ట‌కేల‌కు నాని సినిమా ‘వి’ కూడా ప్రేక్ష‌కుల ముందుకు ఓటీటీ ద్వారానే రానుంద‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

నాని హీరోగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘వి’. నాని హీరోగా న‌టించిన 25వ చిత్రం. దిల్‌రాజు బ్యాన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌లో రూపొందింది. ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల చేయాల‌నుకున్న ఈ సినిమా క‌రోనా వ‌ల్ల‌ వాయిదా ప‌డింది. మ‌ధ్య‌లో సినిమాను ఓటీటీలో విడుద‌ల చేస్తార‌ని కూడా వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అలాంటిదేమీ లేద‌ని నిర్మాత‌లు అప్ప‌ట్లో ఖ‌రారు చేశారు కానీ.. థియేట‌ర్స్ విష‌యంలో ఓ క్లారిటీ రాక‌పోవ‌డంతోచివ‌ర‌కు నిర్మాత‌లు ఫ్యాన్సీ ఆఫ‌ర్‌కు ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్‌కు డిజిట‌ల్ విడుద‌ల‌కు ఓకే చెప్పేశార‌ట‌. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీపై నిర్మాత‌లు అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz