NBK 108: దసరా బరిలో బాలయ్య.. నలుగురి హీరోలతో తలపడనున్న నటసింహం


Send us your feedback to audioarticles@vaarta.com


నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో వున్న సంగతి తెలిసిందే. కెరీర్లో ఎన్నడూ లేనంత జోష్‌లో బాలయ్య వున్నారు. అఖండ, వీర సింహారెడ్డిల హిట్లతో పాటు ఓటీటీలోనూ సత్తా చాటారు. ఇక తొలిసారిగా యాడ్స్‌లోనూ నటిస్తున్నారు. వీటన్నింటికీ మించి ఐపీఎల్ సీజన్ 13 కామెంటేటర్‌గానూ బాలకృష్ణ వ్యవహరించనున్నారు. ఇవన్నీ చేస్తూనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను ఆయన వేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎన్బీకే 108 చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల గురించి మేకర్స్ హింట్ ఇచ్చారు. దసరా కానుకగా బాలయ్య బరిలోకి దిగుతారని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ‘‘విజయదశమికి ఆయుధపూజ’’ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో దుర్గాదేవి ఆమె వెనుక బాలయ్య పవర్ ఫుల్ లుక్ వైరల్ అవుతోంది.
బాలయ్యతో తొలిసారి జోడీకడుతోన్న కాజల్:
కాగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఎన్బీకే 108ని హరీష్ పెద్ది, సాహూ గార్లపాటి నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన తొలిసారిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఆయన కుమార్తెగా శ్రీలీల కనిపించనున్నారు. కాజల్‌ను తెలుగు తెరకు పరిచయం చేసింది నందమూరి కుటుంబమే. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణంతో ఆమె టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌తో బృందావనం, బాద్షా, టెంపర్ సినిమాల్లో కాజల్ నటించారు. ఇప్పుడు బాబాయ్ బాలయ్యతో కాజల్ జోడీ కడుతున్నారు. అనిత్ రావిపూడితో చిత్రం తర్వాత బోయపాటి శ్రీనుతో మరోసారి బాలకృష్ణ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖండ 2ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్సులు వున్నాయి.
రామ్, రవితేజ, విజయ్‌లతో తలపడనున్న బాలయ్య :
అయితే బాలయ్య ఎంట్రీతో దసరా సీజన్లో సినిమాల తాకిడి మరింత పెరిగింది. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న.. రామ్ పోతినేని నటిస్తోన్న ‘ఉస్తాద్’’, ఇళయ దళపతి విజయ్ నటిస్తోన్న లియో అక్టోబర్ 19న విడుదల కానున్నాయి. దీంతో మొత్తం నాలుగు సినిమాలు దసరా బరిలో నిలిచినట్లయ్యింది. రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు దసరాకు తమ సినిమాలను ఫిక్స్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.