close
Choose your channels

హారిక, అభిలను వీడియోలు చూపిస్తూ చెడుగుడు ఆడేసిన నాగ్...

Sunday, November 29, 2020 • తెలుగు Comments

హారిక, అభిలను వీడియోలు చూపిస్తూ చెడుగుడు ఆడేసిన నాగ్...

‘మిరా మిరా మీసం..’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. నిన్న ఏం జరిగిందనేది చూశారు. దీనిలో భాగంగా అఖిల్ దోశల పిండి కలుపుతుంటే.. కిచెన్‌లోకి రావాలంటే అడిగి రావాలని అభి చెప్పాడు. దానిని ఒక ఇష్యూ చేశాడు. హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చానని.. బర్డెన్ నీకు పడకూడదని వచ్చానని చెప్పినా వినకుండా అభి పెద్ద ఇష్యూ చేశాడు. నువ్వే చేసుకో అని అఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోయి బాగా ఎమోషనల్ అయ్యాడు. మోనాల్ వెళ్లి ఓదార్చింది. నేను మాట్లాడాలని ట్రై చేస్తున్నా వినట్లేదని మోనాల్‌కు చెప్పాడు. మరోవైపు అభి.. నీ యాటిట్యూట్ 12 వారాల నుంచి చూస్తున్నా అని అఖిల్ గురించి చెప్పుకొస్తున్నాడు. నేను అభికి అసలు నచ్చనని ఎంతగా కలుపుకోవాలని ట్రై చేసినా పట్టించుకోడని అఖిల్ చెప్పాడు. మొత్తానికి ఈ వారం అభి బిహేవియర్ కాస్తా తనకు నెగిటివ్ తెచ్చేదిగానే కనిపిస్తోంది. పంకజ్ కస్తూరి టాస్క్‌ను చాలా ఫన్‌తో కంటెస్టెంట్‌లంతా కలిసి పూర్తి చేశారు. నెక్ట్స్ స్కందాన్షి టాస్క్‌ను సైతం కంప్లీట్ చేశారు. స్కందాన్షి వాళ్లు కంటెస్టెంట్‌లకు గిఫ్టులు పంపారు.

హారిక, అభిలను వీడియోలు చూపిస్తూ చెడుగుడు ఆడేసిన నాగ్...

కంటెస్టెంట్‌ల ముందుకు వెళ్లిన వెంటనే నాగ్.. బెస్ట్ కెప్టెన్‌గా ఎంపికైన హారికను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. బెస్ట్ కెప్టెన్ కావడానికి నువ్వేం చేశావని అడిగారు. హారిక తన వర్షన్ తాను చెప్పింది. నాగ్.. ముందుగా హారికకు ఒక వీడియో చూపించారు. మోనాల్ బిజినెస్‌లో నన్ను లాగడం ఇష్టం లేదని చెబుతున్న వీడియోను చూపించారు. దీనిలో రెండు రెస్పాన్సిబులిటీస్‌ను మిస్ చేశావని.. ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే చెప్పలేదని.. టాస్క్ ఆడనంటే ఊరుకున్నావని నాగ్ క్లాస్ పీకారు. మరో వీడియో కూడా చూపించారు. అభి.. మోనాల్ మదర్ రాగానే ఎక్కడికైనా వెళ్లి దాక్కొంటా అని చెబుతున్న వీడియోను చూపించారు. ఆ వీడియోలో హారిక కూడా ఉంది. ఎవరన్నారు ఏడిపించారన్న మాట? అని అడిగితే.. అభియే అన్నాడని ఒప్పుకుంది. కెప్టెన్‌గా అభికి విపరీతమైన ఫేవరిటిజం చూపించావని నాగ్ సీరియస్ అయ్యారు. నీకు ఇంకో వీడియో చూపిస్తానని.. అభి వాళ్ల నాన్నగారు మోనాల్‌ని మెచ్చుకోవడం గురించి చెబుతున్న వీడియోను చూపించారు. నువ్వు బై ది పీపుల్.. ఫర్ ది పీపుల్ అని చెప్పావని.. కానీ నువ్వు బై ద మోనాల్.. ఫర్‌ ది అభిజిత్ కెప్టెన్ అయ్యావంటూ క్లాస్ పీకారు. బట్టల విషయంలో అవినాష్‌కి చెయ్యలేదు.. మోనాల్‌కి చేశానని చెప్పి.. అవినాష్‌కి దండేశావు. మరి అప్పుడే మోనాల్‌తో అవినాష్‌ని స్వాప్ చేసి ఉండొచ్చుగా అని ప్రశ్నించారు. నీకు రైట్ పర్సన్ అభిజిత్ మాత్రమేనన్నారు. మరో వీడియో చూపించారు. మోనాల్‌ని అభితో స్వైప్ చేసిన వీడియో చూపించారు. దీనిలో అఖిల్‌తో స్వాప్ నేను చేయలేను అని హారిక వీడియోలో చెప్పడాన్ని హారిక ప్రశ్నించింది. మరి మోనాల్ అఖిల్ అని చెప్పినప్పుడైనా ఎవిక్షన్ పాస్ కోసం అఖిల్‌ని సెలక్ట్ చేసి ఉండొచ్చుగా అని ప్రశ్నించారు. బట్టల విషయంలో మోనాల్‌కి హెల్ప్ చేశావా? అని అడిగారు. బజర్ మోగాక మాత్రమే బట్టలు తీసుకొచ్చి పెట్టావని చెప్పి ఆ వీడియోను కూడా చూపించారు. పక్కనబెట్టండి.. నాగ్ సార్ వచ్చి చూశారని అని నువ్వొక్కదానివే చెప్పావని నాగ్ చెప్పారు. చెట్టు ఆకులు లెక్కబెట్టే టాస్క్ ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. మొత్తానికి నాగ్.. హారిక తప్పులన్నీ బయటపెట్టి సుతిమెత్తగా కడిగి పారేశారు. ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడాలని సలహా ఇచ్చారు.

ఎవరు ఏఏ తప్పులు చేశారో ఎవరికి వారే చెప్పాలని అడిగారు. అప్పుడు సొహైల్ అరియానాను వెక్కిరించింది.. కన్ఫెషన్ రూమ్‌లో భయపడింది.. మోనాల్ ఛీ అంటే ఇచ్చిన రెస్పాన్స్ తన తప్పులని ఒప్పుకున్నాడు. తరువాత అరియానాను నువ్వు నా దృష్టిలో బెస్ట్ కెప్టెన్‌వి అన్నారు. అవినాష్ తప్పులడగా.. అరియానాను వెర్రిపప్పలా కనిపిస్తున్నానా? అన్నానని అది తన తప్పని చెప్పాడు. ఇంకా తన తప్పుల గురించి చెప్పాడు. నామినేషన్స్ టైమ్‌లో ఎందుకలా అవుతావని అవినాష్ ప్రశ్నించాడు. మోనాల్.. అఖిల్ విషయంలో ఆర్గ్యూ చేశానని అది తన తప్పుగా చెప్పింది. రైట్ పర్సన్‌తో స్వాప్ చేయమని అడిగితే హారిక చేయలేదని అదే నేను ఫీల్ అయ్యానని చెప్పింది. నెక్ట్స్ అఖిల్.. మొన్న టాస్క్‌లో కరెక్ట్‌గా చేయలేదని అనిపించిందని చెప్పాడు. సీక్రెట్ రూం నుంచి వచ్చినప్పుడు హారికతో మాట్లాడిన తీరుకి సారీ కూడా చెప్పానని అఖిల్ చెప్పాడు.

హారిక, అభిలను వీడియోలు చూపిస్తూ చెడుగుడు ఆడేసిన నాగ్...

ముందుగా మెయిన్ గేట్ డోర్స్ ఓపెన్ చేయించి ఆ తరువాత అభి.. నువ్వు చేసిన తప్పులేంటని అడిగాడు. మోనాల్ విషయంలో తప్పు చేశానని అభి చెప్పాడు. తాను మోనాల్‌ని ఏడిపించలేదని అభి చెప్పాడు. మరోసారి అభి.. మోనాల్‌ను ఏడిపించానని చెబుతున్న వీడియోను నాగ్ ప్లే చేయించారు. నువ్వే ఏడిపించానని అన్నావు కదా.. ఆ మాటలే కదా.. బిగ్‌బాస్ టాస్క్‌లో పంపించారు అని నాగ్ అడిగారు. తన తప్పే అన్నాడు. చెట్టు ఆకులు లెక్కపెడితే ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుందని అన్నావని.. మరి బిగ్‌బాస్ చెప్పిన టాస్క్ చెయ్యక పోవడం కరెక్టా అని నాగ్ అడిగారు. నాపైన నెట్టకు అని అభిని నాగ్ ప్రశ్నించారు. తప్పు చేశానని అభి ఒప్పుకున్నాడు. వెంటనే నాగ్ డోర్స్ క్లోజ్ చేయించారు. అభి.. నువ్వు తప్పు చేశానని ఒప్పుకోకుంటే నిన్ను ఈ క్షణమే బయటకు పంపించాల్సి వచ్చేదని నాగ్ చెప్పారు. మీ అందరికీ నేను దణ్ణం పెట్టి చెబుతున్నా. అంతా గేమ్ ఆడండని నాగ్ చెప్పారు. మీరు అచీవ్ చేసింది చాలా గ్రేట్ అని నాగ్ బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తరువాత మోనాల్‌ను నాగ్ సేఫ్ చేశారు. ఇక ముగ్గురు మిగిలారు. అవినాష్‌ని ఎవిక్షన్ పాస్‌ని ఈ వారం వాడతారా? వచ్చే వారం వాడతావా? నీకోసమా? వేరొకరి కోసం వాడతావా? డిసైడ్ చేసుకోమని చెప్పి షోని ముగించారు. మొత్తానికి ఇప్పటి వరకూ జరిగిన సీజన్స్‌లోకే ఇది హైలైట్ అని చెప్పాలి. ఒక కంటెస్టెంట్‌కి ఇన్ని వీడియోలు చూపించి క్లాస్ పీకడం ఇదే తొలిసారేమో.. మొత్తానికి హారిక, అభిలను నాగ్ వీడియోలు చూపిస్తూ చెడుగుడు ఆడేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz