close
Choose your channels

మ‌ల్టీస్టార‌ర్‌గా నాగార్జున 100వ చిత్రం.. డైరెక్ట‌ర్ ఫిక్స్‌?

Wednesday, March 24, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌ల్టీస్టార‌ర్‌గా నాగార్జున 100వ చిత్రం.. డైరెక్ట‌ర్ ఫిక్స్‌?

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన అక్కినేని నాగార్జున హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసి ముప్పై ఐదేళ్లు అవుతుంది. ఈ లాంగ్ జ‌ర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు నాగార్జున 96 సినిమాల‌ను పూర్తి చేశాడు. ఇందులో సామాజిక‌, చారిత్రాత్మ‌క‌, పౌరాణిక సినిమాలెన్నింటినో చేసి మెప్పించారు. ప‌క్కా మాస్ సినిమాలు, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు, ప్రేమ‌క‌థా చిత్రాలు, కుటుంబ క‌థా చిత్రాలతో ఇన్నేళ్లుగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ త‌న‌దైన మార్కును క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈయ‌న న‌ట వార‌సులుగా అక్కినేని నాగ‌చైత‌న్య‌, అఖిల్ త‌మ‌దైన గుర్తింపు సంపాదించుకుని ముందుకెళ్తున్నారు.

ఈ క్ర‌మంలో నాగార్జున ఓ అరుదైన ఘ‌న‌త‌ను వ‌చ్చే ఏడాదిలో సాధిస్తాడ‌ని అంటున్నారు. ఇంత‌కీ ఆ ఘ‌న‌త ఏంటో తెలుసా? 100వ చిత్రంలో న‌టించ‌డం. ప్ర‌స్తుతం ప్రవీన్ స‌త్తారుతో నాగార్జున చేస్తున్న సినిమా 97వ చిత్రం. బంగార్రాజు 98వ చిత్రం. ఈ రెండు సినిమాల‌ను ఈ ఏడాదిలోనే పూర్తి చేసేలా నాగ్ ప్లాన్ చేసుకున్నాడు. అలాగే 99వ సినిమాను కూడా నాగార్జున ప్లాన్ చేసేశాడ‌ట‌. అదే స్పీడుతో త‌న 100వ సినిమాకు కూడా నాగార్జున ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ట్లు సినీ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల మేర‌కు నాగార్జున త‌న 100వ చిత్రాన్ని మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని ఫుల్ లెంగ్త్ పాత్ర‌లో న‌‌టించ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం చిరంజీవితో లూసిఫ‌ర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. మ‌రిందులో నిజానిజాలేంటో తెలియాలంటే కొన్నిరోజులు వెయిటింగ్ త‌ప్ప‌దు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.