close
Choose your channels

అల్లుడుకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు

Sunday, April 18, 2021 • తెలుగు Comments

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక వివాహం జరిగిన విషయం తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం డిసెంబర్ 9న రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరిగిన ఈ వివాహానికి అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన చెల్లెలి వివాహాన్ని అంతా తానై జరిపించాడు. ప్రస్తుతం నిహారిక, చైతన్యల దాంపత్యం ప్రశాంతంగా ఆనందంగా సాగుతోంది. నిహారిక సైతం తన భర్తతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది.

ఇక మెగా బ్రదర్ నాగబాబు విషయానికి వస్తే ఆయనకు తన కూతురంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సందర్భాల్లో తన కూతురిపై ఉన్న ప్రేమను ఆయన వెల్లడించారు. పెళ్లయిన తర్వాత తన కూతురిని చాలా ప్రేమగా చూసుకుంటున్న అల్లుడు చైతన్యకు నాగబాబు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. చైతన్య కాస్ట్లీ కారును బహుమతిగా ఇచ్చి నాగబాబు సర్‌ప్రైజ్ చేశారు. రేంజ్ రోవర్ డిస్కవర్ తెలుపు రంగు కారును నిహారిక-చైతన్యలను ఇస్తున్న ఫోటోలను నాగబాబు తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

‘నా అల్లుడికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నా’ అని నాగబాబు ఇన్‌స్టా గ్రాంలో అభిమానులతో పంచుకున్నారు. ఇక కూతురు, అల్లుడు నిహారిక, చైతన్యకు కారును డెలివరీ చేస్తున్న ఫోటోను షేర్‌ చేశారు. గిఫ్ట్ ఇచ్చిన కారు ఖరీదు దాదాపు 70 లక్షలు ఉంటుదని అంచనా. అయితే వాస్తవానికి ఇది ఉగాదికి ఇవ్వాల్సిన కానుక అని.. కానీ కాస్త ఆలస్యం అయ్యిందని నాగబాబు తన యూట్యూబ్‌ ఛానల్‌లో తెలిపారు. కారును గిఫ్ట్‌గా అందుకున్న నిహారిక, చైతన్యల జంట చాలా ఖుషీగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

Get Breaking News Alerts From IndiaGlitz