close
Choose your channels

హర్రర్ తో నాగచైతన్య ఓటిటి ఎంట్రీ.. మూడోసారి అదే డైరెక్టర్ తో..

Tuesday, July 27, 2021 • తెలుగు Comments

హర్రర్ తో నాగచైతన్య ఓటిటి ఎంట్రీ.. మూడోసారి అదే డైరెక్టర్ తో..

అక్కినేని హీరో నాగ చైతన్య రొమాంటిక్, ఎమోషనల్ ప్రేమకథా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. నాగచైనత్య నటించిన లవ్ స్టోరీ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో వైవిధ్యం కోసం చైతు కొత్త మార్గాలని అన్వేషిస్తున్నాడు. అందులో భాగంగానే అమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' చిత్రంతో చైతు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: భారీ సెటప్ తో మొదలుకానున్న శంకర్, రాంచరణ్ మూవీ!

చైతు మరో ఆసక్తికర నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఓ వెబ్ సిరీస్ ద్వారా చైతు ఓటిటిలోకి అడుగుపెట్టబోతున్నాడు. శరత్ మరార్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఆసక్తికర అంశం ఏంటంటే ఈ వెబ్ సిరీస్ కు 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకుడు.

హర్రర్ తో నాగచైతన్య ఓటిటి ఎంట్రీ.. మూడోసారి అదే డైరెక్టర్ తో..

విక్రమ్ కుమార్, చైతు కాంబోలో రాబోతున్న మూడవ ప్రాజెక్ట్ ఇది. 'మనం' చిత్రంలో విక్రమ్ కుమార్ దర్వకత్వంలో చైతు నటించాడు. ప్రస్తుతం 'థాంక్యూ' చిత్రానికి కూడా విక్రమ్ కుమారే డైరెక్టర్. ఈ వెబ్ సిరీస్ తో వీరిది హ్యాట్రిక్ కాంబో కానుంది. ఈ వెబ్ సిరీస్ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కనుంది.

హర్రర్ తో నాగచైతన్య ఓటిటి ఎంట్రీ.. మూడోసారి అదే డైరెక్టర్ తో..

ఎనిమిది ఎపిసోడ్స్ తో ఈ వెబ్ సిరీస్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఎపిసోడ్ గ్రిప్పింగ్ గా, థ్రిల్లర్ అంశాలతో ఉండబోతున్నట్లు సమాచారం. విక్రమ్ కుమార్ దర్శకత్వ ప్రతిభ తెలిసే చైతు ఈ ప్రాజెక్ట్ కి అతడిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. థాంక్యూ మూవీలో చైతు, రాశి ఖన్నా జంటగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలోని పాటలు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz