close
Choose your channels

నాగ‌చైత‌న్య బాలీవుడ్ ఎంట్రీ

Monday, January 25, 2021 • తెలుగు Comments

నాగ‌చైత‌న్య బాలీవుడ్ ఎంట్రీ

అక్కినేని నాగ‌చైత‌న్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారా? అంటే అవున‌నే వార్త‌లు సినీ వ‌ర్గాల్లో ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే నాగ‌చైత‌న్య సోలో హీరోగా బాలీవుడ్‌లో న‌టించ‌డం లేద‌ట‌. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్‌లో ఒక‌రైన ఆమిర్‌ఖాన్ హీరోగా రూపొందుతోన్న లాల్‌సింగ్ చ‌ద్దాలో నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్నాడ‌ట‌. నిజానికి ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌ను విజ‌య్ సేతుప‌తితో చేయించాల‌ని అనుకున్నార‌ట‌. ముందు విజ‌య్ సేతుప‌తి ఓకే చెప్పాడ‌ట‌. అయితే కోవిడ్ ప్ర‌భావంతో విజ‌య్ సేతుప‌తి సినిమా డేట్స్ అన్నీ క్లాష్ అవుతున్నాయి. దీంతో విజ‌య్ సేతుప‌తి లాల్ సింగ్ చ‌ద్దా నుండి త‌ప్పుకున్నాడ‌ట‌. ఆ స్థానంలో నాగ‌చైత‌న్య‌ను తీసుకోవాల‌ని బాలీవుడ్ నిర్మాత‌లు నాగ‌చైత‌న్య‌ను సంప్ర‌దించిన‌ట్లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో థాంక్యూ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. మరో వైపు చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్‌స్టోరి సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని విడుదలకు సన్నద్ధమవుతోంది.

Get Breaking News Alerts From IndiaGlitz