close
Choose your channels

థియేటర్లకు ఆదాయం పెరిగే ఐడియా ఇచ్చిన నాగ్ అశ్విన్!

Friday, May 15, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

థియేటర్లకు ఆదాయం పెరిగే ఐడియా ఇచ్చిన నాగ్ అశ్విన్!

సావిత్రి బయోపిక్ ‘మహానటి’ చిత్రంతో స్టార్ హోదా అందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో ఆయన పేరు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు బాలీవడ్ వరకు మార్మోగింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాగీ.. తాజాగా ఆసక్తికరమైన ప్రతిపాదన చేశాడు. అదేమిటంటే.. సినిమా థియేటర్లలో కూడా మద్యం అమ్మితే.. ఆదాయం పెరిగే అవకాశముందని ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు. ‘ఓ సారి నిర్మాత సురేశ్ బాబు, హీనె రానా దగ్గుబాటితో చర్చ సందర్భంగా విదేశాల్లో మాదిరే మన థియేటర్లలో కూడా బీరు, బ్రీజర్, వైన్ సప్లై చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఈ విధానంతో థియేటర్లు ఫుల్ అవ్వొచ్చేమో కదా అనిపించింది. ఆదాయం కూడా బాగానే వస్తుంది అని నాకు అనిపించింది’ అని ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్‌కు పెద్ద ఎత్తున రియాక్షన్స్ రావడంతో మరోటి కూడా ట్వీటారు.

చెప్పండి నెటిజన్స్..!

అంతేకాదు.. ఇలా మద్యం అమ్మకం వల్ల థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను తగ్గిస్తుందేమో అనే అనుమానం కూడా ఆయన వ్యక్తం చేశారు. ఇదే సమస్యకు పరిష్కారం అన్నట్టుగా కాకుండా కొన్ని మల్టీప్లెక్స్ ల్లో ఇదొక ఆప్షన్ లాగానే పరిగణించాలని థియేటర్స్ యాజమాన్యానికి పరోక్షంగా ఆయన సూచించారు. అంతటితో ఆగని ఆయన.. చెప్పండి నెటిజన్స్.. ఇది మంచి ఆలోచన అంటారా? చెడు ఆలోచన అంటారా? అంటూ ప్రశ్నించారు. అయితే ఆయన ప్రశ్నకు పలువురు నెటిజన్లు మీ ఐడియా బాగానే ఉంది సార్ అని చెప్పగా.. చాలా ఎక్కువ శాతం ఇదీ మరి చెత్తలా ఉంది సార్.. అసలు మీరు చేయాల్సిన ట్వీట్స్ ఇవి కావంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో మార్నింగ్ షోకు వచ్చి తాగి పడిపోయినోడు సాయంత్రం వరకూ ఇంటికెళ్లలేడు.. వాడ్ని లేపడానికి థియేటర్స్ యాజమాన్యాలు నానా తంటాలు పడాల్సి వస్తుంది ఇలాంటి ఐడియాలు మీకు ఎక్కడ్నుంచి వస్తాయ్ సార్.. ఇది బాలేదు అని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్‌తో సినిమా..

కాగా.. ‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. ఈ సినిమా మొత్తం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో కొనసాగనుందని ఈ ప్రకటన వచ్చిన నాటి నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోలా కనిపిస్తాడని సమాచారం. సూపర్ నేచురల్ పవర్స్ వుండే హీరోలా ఆయన పాత్ర ఉంటుందని వార్తలు గుప్పుమంటున్నాయ్. ఆయన లుక్ .. బాడీ లాంగ్వేజ్ ‘క్రిష్’ చిత్రంలో హృతిక్ రోషన్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంటుందట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.