close
Choose your channels

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబె అరెస్ట్

Thursday, July 9, 2020 • తెలుగు Comments

కాన్పూర్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో పోలీసులు దూబేను పట్టుకున్నారు. నగరంలోని మహంకాళి దేవాలయంలో పూజలు చేసేందుకు దూబే రావడంతో అక్కడి గార్డు.. దూబేను గుర్తించి పట్టుకున్నాడు. అనంతరం ఎస్పీకి సమాచారం అందించాడు. దీంతో ఉజ్జయిని పోలీసులు వెంటనే అమ్మవారి దేవాలయానికి వెళ్లి దూబేను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దూబేను పోలీసులు రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా... గత గురువారం అర్థరాత్రి దాటిన తరువాత తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు ఎనిమిది మందిని దూబే.. అతని అనుచరులు దాడి చేసి ఎనిమిది మందిని హతమార్చిన విషయం తెలిసిందే. హతుల్లో ఒక డీఎస్పీ సహా.. ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం పోలీసుల నుంచి దుండగులు ఆయుధాలను లాక్కొని పారిపోయారు. తర్వాత పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు దూబే అనుచరులు ప్రేమ్‌ ప్రకాశ్‌, అతుల్‌ దూబేలు హతమయ్యారు. అప్పటి నుంచి మిగతా బృందం కోసం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం పెద్ద ఎత్తున అన్వేషణ మొదలుపెట్టింది.

Get Breaking News Alerts From IndiaGlitz