close
Choose your channels

'శాకుంత‌లం'లో క‌లెక్ష‌న్ కింగ్ విల‌క్ష‌ణ పాత్ర‌..!

Tuesday, March 16, 2021 • తెలుగు Comments

శాకుంత‌లంలో క‌లెక్ష‌న్ కింగ్ విల‌క్ష‌ణ పాత్ర‌..!

గ‌త ఏడాది ‘ఓ బేబి’ స‌క్సెస్ త‌ర్వాత మ‌రో సినిమాలో మాత్రం ఇంత వ‌ర‌కు న‌టించ‌లేదు. మ‌ధ్య కోవిడ్ ఎఫెక్ట్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమితం అయ్యింది. అయితే మ‌ధ్య‌లో తెలుగు ఓటీటీ ‘ఆహా’లో సామ్ జామ్ ప్రోగామ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంత‌లం సినిమాలో న‌టించ‌డానికి సిద్ధ‌మైంది. సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది కూడా. మ‌హాభార‌తం, ఆదిప‌ర్వంలోని శకుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు ప్రేమ‌క‌థ‌ను ‘శాకుంత‌లం’ సినిమా రూపొందుతుంది. స‌మంత అక్కినేని ఇందులో శ‌కుంత‌ల అయితే, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ దుష్యంత మ‌హారాజు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

అయితే శకుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు ప్రేమించుకుని గంధ‌ర్వ వివాహం చేసుకుంటారు. వారి ప్రేమ క‌థ కీల‌క మ‌లుపు దుర్వాస మ‌హాముని వ‌ల్ల‌నే జ‌రుగుతుంది. దుర్వాసుడు అంటే అమిత కోప‌స్థుడు. ఆయ‌న శాపం కార‌ణంగా శ‌కుంత‌ల‌ను దుష్యంతుడు మ‌ర‌చిపోతాడు. త‌ర్వాత ఆయ‌నే శాప విమోచ‌నాన్ని కూడా సూచిస్తాడు. ఇలాంటి ఓ బ‌రువైన పాత్ర‌ను క్యారీ చేయాలంటే సీనియ‌ర్ ఆర్టిస్ట్ అవ‌స‌రం అని భావించిన గుణ‌శేఖ‌ర్.. విల‌క్ష‌ణ న‌టుడు, క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబును సంప్ర‌దించ‌గా ఆయ‌న ఓకే చెప్పాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి-గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ‘శాకుంత‌లం’ విడుద‌ల‌వుతుంది.

Get Breaking News Alerts From IndiaGlitz