close
Choose your channels

మెగాఫోన్ ఆలోచ‌న‌లో క‌లెక్ష‌న్ కింగ్‌

Monday, August 24, 2020 • తెలుగు Comments

మెగాఫోన్ ఆలోచ‌న‌లో క‌లెక్ష‌న్ కింగ్‌

క‌లెక్షన్ కింగ్ మోహ‌న్‌బాబు తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం అక్క‌ర్లేని పేరు. 560పైగా చిత్రాల్లో న‌టుడిగా రాణించారు. నిర్మాత‌గానూ యాబై పైగా సినిమాల‌ను నిర్మించారు. అయితే కొద్దికాలంగా సినిమాల్లో న‌ట‌న‌కు దూరంగానే ఉంటున్నారు. చాలా ఎగ్జ‌యిట్ అయిన స్క్రిప్ట్ వ‌స్తే త‌ప్ప న‌టించ‌డానికి ఆయ‌న ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఆగ‌స్ట్ 15న స్వాతంత్ర్య దినోత్స‌వ సంద‌ర్భంగా ‘సన్నాఫ్ ఇండియా’ పేరుతో సినిమా చేయ‌బోతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇప్పుడు త‌న సొంత బ్యాన‌ర్‌లో ఆయ‌న మ‌రిన్ని సినిమాలు చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని ద‌గ్గ‌రి వ‌ర్గాల స‌మాచారం. అంతే కాదండోయ్‌! మోహ‌న్‌బాబు ఈసారి మెగాపోన్ ప‌ట్ట‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

తెలంగాణ యాస‌, బ్యాక్‌డ్రాప్ నేప‌థ్యంలో మోహ‌న్‌బాబు సినిమా చేయ‌డానికి సిద్ధం చేసుకుంటున్నార‌ని టాక్‌. అయితే ఆయ‌నకు మెగాఫోన్ ప‌ట్టాల‌నే ఆలోచ‌న ఎందుకు వ‌చ్చిందో ఆయ‌నే చెప్పాల్సి ఉంది. ఒక‌వేళ ఆయ‌న త్వ‌ర‌లోనే మెగాఫోన్ ప‌డితే మాత్రం ఇన్నాళ్లు న‌టుడిగా, నిర్మాత‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న మోహ‌న్‌బాబు డైరెక్ట‌ర్‌గా ఎలాంటి స‌క్సెస్‌ను అందుకుంటారో వేచి చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz