close
Choose your channels

ఆకట్టుకుంటోన్న 'మిస్‌ ఇండియా' ట్రైలర్‌.... నవంబర్‌ 4న నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా విడుదల

Saturday, October 24, 2020 • తెలుగు Comments

ఆకట్టుకుంటోన్న మిస్‌ ఇండియా ట్రైలర్‌.... నవంబర్‌ 4న నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా విడుదల

‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేశ్‌. ఈమె టైటిల్‌ పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ 'మిస్‌ ఇండియా'. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్‌ 4న ప్రముఖ డిజిటల్‌ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం చిత్రయూనిట్ విడుదల చేసింది. ట్రైలర్‌ను చూస్తే...

సాధారణంగా పిల్లలు డాక్టరో, పోలీసో, లాయరో కావాలని కలలు కంటారు. కానీ.. ఆ కలలను నేరవేర్చుకునేవారు మాత్రం అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన అమ్మాయి సంయుక్త. చిన్నప్పట్నుంచి బిజినెస్‌ రంగంలో రావాలనుకునే సంయుక్త దిగువ మధ్యతరగతి అమ్మాయి. ఇంట్లో అన్నయ్య, తను పనిచేస్తే కానీ.. ఇల్లు గడవడం కష్టం. అలాంటి కుటుంబానికి చెందిన సంయుక్త .. తనకు ఎదురైన సవాళ్లను దాటి 'మిస్‌ ఇండియా' అనే పేరుతో చాయ్‌ వ్యాపారాన్ని స్టార్ట్‌ చేస్తుంది. అదే రంగంలోని మరో పెద్ద వ్యాపారవేత్త(జగపతిబాబు) ఆమెకు అడ్డుగా నిలుస్తాడు. ఆమె ఏం చేస్తుంది? ఎలా నెంబర్‌ వన్‌గా ఎదిగి 'మిస్‌ ఇండియా అంటే పేరు కాదు.. ఓ బ్రాండ్‌ ' అనేలా చేస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌ ఉంది. సినిమా ప్రతి విజువల్‌ రిచ్‌గా, ఫ్రెష్‌ లుక్‌తో కనిపిస్తుంది. మరో వైపు తమన్‌ నేపథ్య సంగీతం సన్నివేశాలను మరో లెవల్‌లో ఎలివేట్ చేస్తున్నాయి.

తమన్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా కీర్తిసురేష్‌ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో హై బడ్జెట్‌తో రూపొందింది. నవంబర్‌ 4న సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతుంది. కీర్తిసురేశ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న చిత్రమిది. జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్‌, భానుశ్రీ మెహ్రా, నదియా, పూజిత పొన్నాడ, కమల్ కామరాజు తదితరులు ఇందులో నటిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz