రథసప్తమి వేడుకల్లో రామ్మోహన్ నాయుడు


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి విహరించగా.. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్యదేవాలయానికి భక్తులు పోటెత్తారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిత్యుని నిజరూప దర్శనం కోసం నిన్న రాత్రి నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయ్ చంద్, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించగా.. ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అరసవల్లితో పాటు శ్రీకాకుళం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అదనపు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నిధులతో అరసవల్లి, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్ని సుందరంగా తీర్చిదిద్దారు. అరసవల్లిలో పార్క్ అభివృద్ధితో పాటు.. రోడ్డు మధ్యలో ఏర్పాటుచేసిన పలు కళాకృతులు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com