విశాఖపట్నం అభివృద్ధిపై సమీక్ష


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేశ్ కు ఆయువుపట్టులాంటి విశాఖపట్నం అభివృద్ధిపై కూటమి సర్కారు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్, వంశీ కృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు తదితరులు హాజరయ్యారు.
APUFIDC చైర్మన్ పీలా గోవింద్,VMRDA చైర్మన్ ప్రణవ గోపాల్, రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, VMRDA కమిషనర్ విశ్వనాథ్ తదితర అధికారాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆన్ లైన్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశాఖపట్నం మాస్టర్ ప్లాన్ లో మార్పులు-చేర్పుల పై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. విశాఖ లో టీడీఆర్ బాండ్ల ను త్వరితగతిన జారీ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు.
విశాఖలో మెట్రో రైల్ కారిడార్లు , వాటి పొడిగింపు అంశాన్ని సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. విశాఖ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆర్థిక వనరులు, పరిమితులకు లోబడి విశాఖను మ్యాగ్జిమమ్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com