close
Choose your channels

'మెహ‌బూబా' నిడివి ఎంతంటే..

Thursday, May 10, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెహ‌బూబా నిడివి ఎంతంటే..

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తాజా చిత్రం మెహ‌బూబా. 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ పున‌ర్జ‌న్మ‌ల  ప్రేమ‌క‌థా చిత్రం ద్వారా పూరీ త‌న‌యుడు పూరీ ఆకాష్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. అలాగే..  ఉత్త‌రాది భామ నేహా శెట్టి క‌థానాయిక‌గా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ఇంట్ర‌డ్యూస్ అవుతోంది.

ఈ సినిమాతో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు సందీప్ చౌతా చాన్నాళ్ళ త‌రువాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న  ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  ఇదిలా ఉంటే.. ఈ సినిమా నిడివికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.

అదేమిటంటే.. ఈ సినిమా దాదాపు 2 గంట‌ల 32 నిమిషాల నిడివితో ఉంటుంద‌ని స‌మాచారం. ఇది ఒక విధంగా సినిమాకు క‌లిసొచ్చే అంశంగానే చెప్పుకోవ‌చ్చు. టెంప‌ర్ త‌రువాత స‌రైన విజ‌యం లేని పూరీ జ‌గ‌న్నాథ్‌కు ఈ సినిమా అయినా ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.