close
Choose your channels

మెగా అల్లుడి హీరోయిన్ మారింది...

Sunday, January 6, 2019 • తెలుగు Comments

మెగా అల్లుడి హీరోయిన్ మారింది...

మెగా అల్లుడు క‌ల్యాణ్ దేవ్ రెండో సినిమాకు రంగం సిద్ధ‌మవుతోంది. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో పులివాసు ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ముందు ఈ బ్యాన‌ర్‌లో సుధీర్‌బాబు, మెహ‌రీన్ హీరోయిన్స్‌గా సినిమా చేయాల్సింది.

కానీ ముందు సుధీర్ బాబు ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. ఆస్థానంలో క‌ల్యాణ్‌దేవ్ జాయిన్ అయ్యారు. త‌ర్వాత నిర్మాత‌లు మెహ‌రీన్‌ను కూడా కాద‌ని.. కొత్త హీరోయిన్‌ను వెతికారు. తాజా స‌మాచారం ప్ర‌కారం 'తూనీగ తూనీగ' ఫేమ్ రియా చ‌క్ర‌వ‌ర్తిని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది. `విజేత‌` సినిమా త‌ర్వాత క‌ల్యాణ్‌దేవ్ న‌టించ‌నున్న చిత్ర‌మిది.

Get Breaking News Alerts From IndiaGlitz