close
Choose your channels

మెగా డెబ్యూ హీరో సాంగ్ సెన్సేష‌న్‌

Monday, May 11, 2020 • తెలుగు Comments

మెగా డెబ్యూ హీరో సాంగ్ సెన్సేష‌న్‌

ఇప్ప‌టికే ప‌దిమందికి పైగా హీరోలున్న మెగాఫ్యామిలీ నుండి మ‌రో హీరో ప‌రిచ‌యం అవుతున్నారు. అతనెవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అత‌నే వైష్ణ‌వ్ తేజ్‌. ఇప్ప‌టికే హీరోగా నిల‌దొక్కుకున్న మెగా క్యాంప్ హీరో సాయితేజ్ సోద‌రుడు. ఈ యువ హీరో తొలి చిత్రంగా ఉప్పెన తెరకెక్కింది. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్, మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల ఆగిపోయింది. త‌దుప‌రి విడుద‌ల తేదీపై క్లారిటీ లేదు. డిసెంబ‌ర్‌లో ఉప్పెన చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో క్రితి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇందులో విడుద‌లైన రెండు పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా ‘నీ నీలి క‌న్ను స‌ముద్రం... ’ పాట‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా 50 మిలియ‌న్ వ్యూస్‌ను చేరుకుని ఓ డెబ్యూ హీరో సాంగ్‌కు ఈ త‌రహా రెస్పాన్స్ రాబ‌ట్టుకున్న చిత్రంగా పేరు తెచ్చుకుంది. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఇందులో విల‌న్‌గా న‌టించ‌డం విశేషం.

Get Breaking News Alerts From IndiaGlitz