close
Choose your channels

'మాస్ట‌ర్' రిలీజ్ డేట్‌.. ప్లాన్ అదే!

Monday, January 27, 2020 • తెలుగు Comments

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మాస్ట‌ర్‌`. ఎక్స్‌బీ ఫిలిం క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గ్జేవియ‌ర్ బ్రిటో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఆండ్రియా కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ చిత్రంలో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారని టాక్‌. విద్యార్థి, మాస్ట‌ర్ అనే రెండు పాత్ర‌ల్లో విజ‌య్ ఎలా ఆక‌ట్టుకుంటాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని టాక్‌.

ప‌ర్టికుల‌ర్‌గా అదే రోజున సినిమాను విడుద‌ల చేయ‌డానికి కార‌ణం గుడ్ ఫ్రేడే, శనివారం, ఆదివారంతో పాటు ఏప్రిల్ 14న త‌మిళ సంవ‌త్స‌రాది కూడా ఉండ‌టంతో క‌లెక్ష‌న్స్ ప‌రంగా సినిమాకు బాగా క‌లిసొస్తుంద‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే రెండు లుక్స్ విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ జ‌న‌వ‌రి 26న విజ‌య్‌, విజ‌య్ సేతుప‌తి ఉన్న లుక్‌ను విడుద‌ల చేశారు. ఖైదీ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది.

Get Breaking News Alerts From IndiaGlitz