close
Choose your channels

'మా' ఎన్నికలు: విష్ణు ప్యానెల్ ఇదే.. అనుభవానికి పెద్దపీట వేసిన మంచువారబ్బాయ్

Thursday, September 23, 2021 • తెలుగు Comments

మా ఎన్నికలు: విష్ణు ప్యానెల్ ఇదే.. అనుభవానికి పెద్దపీట వేసిన మంచువారబ్బాయ్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సమయద దగ్గర పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ‘మా’ ఎన్నికల్లో రచ్చ చోటు చేసుకుంది. ఈ ఎన్నికలలో అభ్యర్ధులుగా వున్న పోటీదారుల్లో ఎవరు గెలిచినా వారు తమ సొంత ఎజెండాను అమలు పరిచే విధంగా కసరత్తు చేస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో విష్ణు మధ్య పోటీ గట్టిగా ఉంది. తొలుత జీవితా రాజశేఖర్, హేమ సైతం పోటీలో వున్నట్లు ప్రకటించినప్పటికీ.. తెర వెనుక పెద్ద వాళ్లు, ప్రకాశ్ రాజ్ చాణక్యంతో వారిద్దరూ బరిలో నుంచి తప్పుకున్నారు.

మా ఎన్నికలు: విష్ణు ప్యానెల్ ఇదే.. అనుభవానికి పెద్దపీట వేసిన మంచువారబ్బాయ్

అంతేకాకుండా హేమ, జీవితలు ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో సభ్యులయ్యారు. మరోవైపు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించగా, విష్ణు ప్యానెల్‌‌లో ఎవరెవరు ఉంటారా అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ సస్పెన్స్ కు తెర దించుతూ మంచు విష్ణు గురువారం అధికారికంగా తన ప్యానెల్‌ను ప్రకటించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి.

మంచు విష్ణు ప్యానెల్ ఇదే:

మంచు విష్ణు – ప్రెసిడెంట్
మాదాల రవి – వైస్ ప్రెసిడెంట్
బాబు మోహన్ – ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
రఘు బాబు – జనరల్ సెక్రటరీ
శివ – ట్రెజరర్
కరాటే కళ్యాణి – జాయింట్ సెక్రటరీ
గౌతమ్ రాజూ – జాయింట్ సెక్రటరీ

ఎగ్జిక్యూటివ్ మెంబర్స్:

అర్చన
అశోక్ కుమార్
గీత సింగ్
హరినాథ్ బాబు
జయవాణి
మలక్ పేట శైలజ
మాణిక్
పూజిత
రాజేశ్వరి రెడ్డి
రేఖ
సంపూర్ణేష్ బాబు
శశాంక్
శివన్నారాయణ
శ్రీలక్ష్మీ
శ్రీనివాసులు.పి
స్వప్న మాధురి
విష్ణు బొప్పన
వడ్లపట్ల ఎంఆర్సి

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz