close
Choose your channels

మంచు మనోజ్ రెండో పెళ్లి ?

Sunday, March 7, 2021 • తెలుగు Comments

మంచు మనోజ్ రెండో పెళ్లి ?

టాలీవుడ్ క‌థానాయ‌కుడు మంచు మ‌నోజ్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు నెట్టింట హ‌ల్ చల్ చేస్తున్నాయి. 2015లో ప్ర‌ణ‌తి రెడ్డిని మ‌నోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే మ‌న‌స్ప‌ర్ధ‌ల‌తో వారిద్ద‌రూ విడిపోయారు. కొన్నిరోజులుగా సినిమాల‌తో బిజీగా ఉన్న మ‌నోజ్‌, త్వ‌ర‌లోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్త‌లు వినిపించాయి. అది కూడా ఓ హీరోయిన్‌ని అంటూ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే మ‌నోజ్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుండాడ‌నే వార్త‌ల్లో నిజం లేద‌ట‌. మోహ‌న్‌బాబు త‌న కుటుంబానికి ద‌గ్గ‌రి బంధువైన అమ్మాయితో మ‌నోజ్ పెళ్లి చేయ‌బోతున‌ట్లు టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను కూడా త్వ‌ర‌లోనే ఇస్తారట‌.

మ‌నోజ్, ప్ర‌ణ‌తిరెడ్డి మ‌న‌స్ప‌ర్ధ‌ల‌తో విడాకులు తీసుకున్నారు. మ‌న వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌తో మూడేళ్ల నుంచి మ‌నోజ్ సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. విడాకుల విష‌యాన్ని మ‌నోజ్ స్వ‌యంగా తెలియ‌జేశారు. అదే స‌మ‌యంలో తాను ఇక‌పై వ‌రుస సినిమాలు కూడా చేస్తున్న‌ట్లు తెలిపారు మ‌నోజ్‌. అందులో భాగంగా ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా మూవీ అహం బ్ర‌హ్మాస్మి అనే సినిమాలో న‌టిస్తున్నారు మ‌నోజ్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz