close
Choose your channels

మ‌హేష్ థంబ్స‌ప్

Saturday, July 20, 2019 • తెలుగు Comments

మ‌హేష్ థంబ్స‌ప్

ఇంత‌కు ముందు చిత్రాల‌తో పోలిస్తే ఇప్పుడు మ‌హేష్ త‌న అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను, త‌న సినిమాల వివ‌రాల‌ను అట్టే దాచుకోవాల‌ని అనుకోవ‌డం లేదు. పాతిక చిత్రాల త‌ర్వాత వ‌చ్చిన ఈ మార్పున‌కు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఎంత వ‌ర‌కు కార‌ణం అనేది తెలియాలి. ఎవ‌రి వ‌ల్ల‌యితేనేమీ మ‌హేష్ అభిమానులు మాత్రం దిల్‌ఖుష్ అవుతున్నారు. అలాంటి ఖుషీ క‌బ‌రే తాజాగా అనిల్ రావిపూడి వ‌ల్ల తెలిసింది.

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు` కాశ్మీర్ షెడ్యూల్ పూర్త‌యింది. అంటే ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌యింద‌న్న‌మాట‌. తాజాగా రెండో షెడ్యూల్ కోసం అన్ని ఏర్పాట్లూ జ‌రుగుతున్నాయి. రెండో షెడ్యూల్‌ను ఈ నెల 26 నుంచి హైద‌రాబాద్ లో చిత్రీక‌రించ‌నున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్ మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో స‌హా కీల‌క తారాగ‌ణం పాల్గొన్న స‌న్నివేశాల‌ను కాశ్మీర్‌లో తెర‌కెక్కించారు. ఈ సినిమాతో మ‌హేష్‌తో ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంద‌ని అనిల్ రావిపూడి అన్నారు. అంతే కాదు, మ‌హ‌ష్ థంబ్స‌ప్ చేసిన ఫొటో కూడా ఆయ‌న షేర్ చేశారు. మ‌హేష్ కెరీర్లోనే ఇలాంటి లుక్ ఇప్ప‌టిదాకా ఎప్పుడూ రివీల్ కాలేదు. మేజ‌ర్ దుస్తుల్లో ఉన్న మ‌హేష్ కొత్త‌గా క‌నిపిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz