close
Choose your channels

అభిమానుల‌కు మ‌హేశ్ రిక్వెస్ట్‌!!

Friday, August 7, 2020 • తెలుగు Comments

అభిమానుల‌కు మ‌హేశ్ రిక్వెస్ట్‌!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ పుట్టిన‌రోజు ఆగ‌స్ట్ 9.. రెండు రోజుల వ్య‌వ‌థి మాత్ర‌మే ఉంది. ఇప్ప‌టికే మ‌హేశ్ అభిమానులు హంగామా స్టార్ట్ చేశారు. పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సేవా కార్య‌క్ర‌మాల కోసం ఆయ‌న అభిమానులు భారీగా ప్లాన్ చేశారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌ ప‌రిస్థితులు త‌గ్గ‌డం లేదు. దీంతో అభిమానుల‌ను ఉద్దేశించి మ‌హేశ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ్ఞ‌ప్తి చేశారు. ‘‘ప్రియమైన అభిమానులకు, మీరందరూ నాకు తోడుగా ఉండ‌టం నా అదృష్టం. నా పుట్టిన‌రోజు ఓ ప్ర‌త్యేక‌మైన రోజుగా గుర్తుండాల‌ని మీరు చేస్తున్న మంచి ప‌నుల‌కు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అంద‌రినీ అభినందిస్తున్నాను. ప్ర‌స్తుతం క‌రోనాతో మ‌న‌మంద‌రం చేస్తున్న ఈ యుద్ధంలో సుర‌క్షితంగా ఉండ‌టం అనేది అన్నిటికంటే ముఖ్యం. నా పుట్టిన‌రోజున అభిమానులంద‌రూ సామూహిక వేడుక‌ల‌కు దూరంగా ఉండి క్షేమంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు మహేశ్.

మహేశ్ 27వ చిత్రం ‘స‌ర్కారువారి పాట‌’ సినిమా కరోనా వైర‌స్ కార‌ణంగా షూటింగ్ స్టార్ట్ చేసుకోలేదు. ఈ త‌రుణంలో అభిమానుల‌కు మహేశ్ పుట్టిన‌రోజు గిఫ్ట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నుంది.

Get Breaking News Alerts From IndiaGlitz