close
Choose your channels

త్వరలో మహేశ్-మురగ కాంబోలో సినిమా!!

Saturday, January 4, 2020 • తెలుగు Comments

త్వరలో మహేశ్-మురగ కాంబోలో సినిమా!!

సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన ‘దర్బార్‌’. ఈ చిత్రం జనవరి-09న విడుదల కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌ను ఆపేయాలని సంబంధిత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు హైకోర్టు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. దీంతో అసలు అనుకున్న టైమ్‌కు రిలీజ్ అవుతుందో లేదో అని చిత్రబృందం, అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. అయితే శనివారం నాడు ప్రొడ్యూసర్ గిల్డ్స్‌ సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇవ్వడంతో సస్పెన్స్‌కు తెరపడినట్లయ్యింది. ముందుగా అనుకున్నట్లుగానే జనవరి-09న దర్బార్ థియేటర్లలోకి వస్తున్నాడు. కాగా సినిమా కచ్చితంగా అనుకున్న టైమ్‌కు రిలీజ్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ చిత్రబృందం మాత్రం యథావిథిగా ప్రమోషన్స్ షురూ చేసింది. తాజాగా.. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మురుగదాస్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తావన తెచ్చారు. ఆయన మాటలను బట్టి చూస్తే మహేశ్‌తో త్వరలోనే మరో సినిమా ఉంటుందని తెలుస్తోంది.

ఆయన ప్రత్యేక అదే!
మహేశ్ బాబుతో సినిమా తీయాలని ఎన్నోరోజులుగా వేచి చూసిన మురుగ ఎట్టకేలకు ‘స్పైడర్’ సినిమా తీసి.. అట్టర్ ప్లాప్‌ను ఇటు డైరెక్టర్, అటు హీరో ఇద్దరూ ఖాతాలో వేసుకున్నారు. అయితే తాజాగా ఈ విషయాన్ని ప్రస్తావించిన మురుగదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేశ్‌తో చేసిన ‘స్పైడర్’ సినిమా పరాజయాన్ని చవిచూసిందని.. ఆ ప్లాప్ నన్ను బాధిస్తూనే ఉందన్నారు. వాస్తవానికి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడిని హీరోలు పెద్దగా పట్టించుకోరని.. కానీ మహేశ్ మాత్రం ఇప్పటికీ తనను ఎంతో ఆత్మీయంగా పలకరిస్తుంటాడని మురుగ చెప్పారు. మహేశ్‌లోని ప్రత్యేకత అదేనని ఆయన ఒకింత భావోద్వేగంతో చెప్పారు.

మనసు కూడా తెలుపే..!
‘మహేశ్ బాబు రంగు మాత్రమే తెలుపు కాదు.. ఆయన మనసు కూడా తెలుపే’ అని సూపర్‌స్టార్‌ను మురుగ ఆకాశానికెత్తేశారు. మొత్తానికి చూస్తే.. మురుగ-మహేశ్ కాంబోలో సినిమా ఉంటుందని పరోక్షంగా ఇలా చెబుతున్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇదే నిజమైతే సినిమా ఎప్పుడుంటుందో మరి. ఒకవేళ సినిమా ఉంటే ఈసారైనా మహేశ్‌కు సూపర్ హిట్ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz