close
Choose your channels

'కొరమీను' మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన లావణ్య త్రిపాఠి

Saturday, October 29, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జాలరిపేట నేపధ్యంలో సాగే సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'కొరమీను' .ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆనంద్ రవి హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోర్ ధాత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ నటీ నటులుగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మించారు.ఈ "కోరమీను" మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ రోజు విడుదల చేశారు.

మోషన్ పోస్టర్ చూస్తుంటే ఆకాశంలో విపరీతమైన మబ్బులతో మేఘమృతంమై ఉరుములు మెరుపుల మధ్య జాలర్లు పట్టే కొన్ని వందల బొట్స్ కనిపించగా అందులోని ఒక బోట్ పై 'మీసాల రాజ్ మీసాలు ఎవరో కత్తిరించారా! ఎందుకు?' అంటూ పోస్టర్‌లోని BGM, సెట్టింగ్ మరియు పోస్టర్ చూస్తుంటే ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తుంది. అక్కడే ఒక యువకుడు సీరియస్ గా ఎంతో తీక్షణమైన లుక్‌తో చూసే విధానం చూస్తుంటే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

ఈ సందర్బంగా దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ.. మా చిత్ర మోషన్ పోస్టర్ ను లావణ్య త్రిపాటి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథ విషయానికి వస్తే జాలారిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో సాగే కథ ఇది. .సరదా-ప్రేమగల డ్రైవర్, అతని యజమాని అయిన అహంకారి ధనవంతుడు మరియు వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు ఇలా మూడు ముఖ్యమైన పాత్రలతో మంచి కంటెంట్ తో వస్తున్న "కొరమీను" అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటీ నటులు : కోటిగా ఆనంద్ రవి, కరుణ పాత్రలో హరీష్ ఉత్తమన్, మీసాల రాజుగా శత్రు, మీనాక్షిగా కిషోర్ ధాత్రక్, దేవుడిగా రాజా రవీంద్ర, సీఐ కృష్ణగా గిరిధర్, ముత్యంగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రంగా ప్రసన్న కుమార్, కరుణకు సహాయకుడిగా ఆర్కే నాయుడు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.