తెలంగాణలో ఢిల్లీ ఎన్నికల ఫలితాల వేడి


Send us your feedback to audioarticles@vaarta.com


ఢిల్లీ ఎన్నికల ఫలితాలు, తెలంగాణలో కాక రేపుతున్నాయి. ముందుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనికి ఆద్యం పోశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జీరోకు పరిమితమైంది. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీనిపై కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు.
"కంగ్రాట్స్ రాహుల్ గాంధీ.. మీరు మరోసారి బీజేపీని గెలిపించారు" అంటూ పోస్టు పెట్టారు కేటీఆర్. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
కేజ్రీవాల్, కేసీఆర్ తో చేతులు కలపడం వల్లనే ఢిల్లీలో ఆప్ ఓడిపోయిందంటూ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ తో బీఆర్ఎస్ చేతులు కలిపిందని, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ తో చేతులు కలిపారని.. ఇలా బీఆర్ఎస్ ఎవరితో చేతులు కలిపితే వాళ్లు ఓడిపోయారని, బీఆర్ఎస్ ది మామూలు హ్యాండ్ కాదంటూ ఎద్దేవా చేస్తున్నారు.
మరోవైపు ఢిల్లీ ఫలితాలు కవిత అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందని ప్రజలు నమ్మారని, అందుకే ఆప్ ను ఓడించారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇలా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ రాజకీయాల్లో చాలా విమర్శలు-ప్రతివిమర్శలు నడుస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments