close
Choose your channels

Vijay Antony : ‘‘బిచ్చగాడు ’’ ఫేమ్ విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం

Tuesday, September 19, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమిళ, తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె మీరా (16) ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో ఆమె ఇంటర్ చదువుతోంది. విజయ్ ఆంటోనీ కుటుంబం డీడీకే రోడ్‌లో నివాసం వుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మీరా ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లుగా సమాచారం. మార్కులు, ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడి వుంటారని భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి పరిశీలిస్తున్నారు. మీరా మృతదేహాన్ని ఓమంతురార్ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీరా మరణంపై తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. విజయ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇకపోతే.. విజయ్ ఆంటోని తొలుత సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తమిళంలో వరుస బ్లాక్‌బస్టర్‌ మ్యూజికల్ హిట్స్‌తో ‌బిజీగా మారారు. ఆ తర్వాత హీరోగా మారి వినూత్న కథలతో సినిమాలు తీశారు. బిచ్చగాడుతో ఆయన దక్షిణాదిలో సంచలనం సృష్టించాడు. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టింది. వివాదాలకు దూరంగా వుండే విజయ్ ఆంటోనీని చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇప్పుడు కుమార్తెను కోల్పోవడంతో ఆయనను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.