close
Choose your channels

ప్ర‌భాస్‌ను ఢీ కొట్ట‌నున్న కోలీవుడ్ స్టార్‌..!

Friday, January 22, 2021 • తెలుగు Comments

ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌లో విజ‌య్ క‌ర‌గందూర్ ‘సలార్’ అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రభాస్ చేతిలో మూడు ప్యాన్ ఇండియా సినిమాలున్నాయి. అందులో ఓ చిత్రం ‘సలార్’. రీసెంట్‌గా ప్రారంభ‌మైన ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఫిబ్ర‌వ‌రి నుండి ప్రారంభం కానుంది. జూలై నెల‌లోపు షూటింగ్ పూర్తి చేయ‌డానికి ‘సలార్’ కోసం డేట్స్‌ను కేటాయించాడట ప్ర‌భాస్‌. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో మెయిన్ విల‌న్‌గా కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తిని తీసుకోవాల‌ని చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

‘సలార్’ అంటే కింగ్ మేకర్ అని, రాజుకు కుడిభుజంలాంటి వ్య‌క్తి అని అర్థాన్ని వివరించారు ప్రశాంత్ నీల్. దీంతో సినిమాలో ప్రభాస్ కింగ్ మేకర్ అయితే.. కింగ్ ఎవరు? ప్ర‌భాస్ ఇమేజ్‌కు త‌గ్గ స్టార్ ఎవ‌రు ఉండ‌బోతారు? అనే కోణంలో ప‌లు వార్త‌లు వినిపించాయి. దానికి సమాధానంగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటిస్తాడని అంటున్నారు. దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz