close
Choose your channels

జగన్ చిటికేస్తే.. టీడీపీ అడ్రస్ గల్లంతే.. బాబుకు దమ్ముంటే..!

Saturday, November 16, 2019 • తెలుగు Comments

జగన్ చిటికేస్తే.. టీడీపీ అడ్రస్ గల్లంతే.. బాబుకు దమ్ముంటే..!’

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్క చిటికేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. జగన్ కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందని, మా టీడీపీ పార్టీ సంక్షోభానికి లోకేష్‌ కారణమని, దాన్ని సరిచేసుకోలేక మా నాయకుడు వైయస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే ప్రవర్తిస్తే దేహశుద్ధి తప్పదని స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ జగన్‌పై టీడీపీ నేతలు, పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న ఆరోపణలను కొడాలి నాని ఘాటుగా తిప్పికొట్టారు. ఏపీ సచివాలయంలో శనివారం మీడియా మీట్ నిర్వహించిన మంత్రి నాని.. చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మోసం చేశాడని అప్పుడే చెప్పా!

‘రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది చంద్రబాబే. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకెళ్లి.. వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చింది వాస్తవం కాదా..?. ఆదినారాయణరెడ్డి సభలో అసభ్యంగా మాట్లాడితే చంద్రబాబు వెకిలినవ్వులు నవ్వింది నిజం కాదా..?. జగన్‌ ఎవరికి పార్టీ కండువా కప్పలేదు. చంద్రబాబు విధానాలను విభేదించిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. తాను జగన్‌కు మద్దతు తెలుపుతున్నానని ప్రకటించారు. అందుకే వైసీపీలో చేరతానని వంశీ ప్రకటించారు. దేవినేని అవినాష్‌ నా మీద పోటీ చేశారు. చంద్రబాబు పెద్ద లుచ్చా .. తండ్రి లేని నిన్ను మోసం చేశాడని అప్పుడే చెప్పాను. ఈ రోజు అతను వచ్చి మా పార్టీలో చేరారు’ అని చంద్రబాబుపై నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అభివృద్ధి కోసమే వంశీ మద్దతు...!

‘వంశీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మా పార్టీలోకి వస్తున్నారు. లోకేష్‌ వంటి పప్పుగాడి చేతిలో ఉన్న టీడీపీలో ఉంటే మునిగే పోయే పడవ అని మా పార్టీలోకి వస్తున్నారు. అవినాష్‌ను వైసీపీలో చేర్చుకున్నాం.. వంశీ ఇంకా చేరలేదు. పొద్దునుంచి టీవీలో మాట్లాడుతున్న ఈ సన్యాసులకు వంశీ పార్టీలో చేరింది.. లేనిది తెలియదా..?. ఉమా పిచ్చవాగుడు మానుకో. నీళ్లలో ఎవరైనా ఇసుక తీస్తారా..?. సిమెంట్‌ వాడకపోతే రేట్లు ఎలా పెరుగుతాయ్’ అని నాని చెప్పుకొచ్చారు.

నీ కుక్కలను జాగ్రత్తగా పెట్టుకో..

చంద్రబాబు, పవన్‌ పిల్లలు ఏం మీడియంలో చదువుతున్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఇంగ్లీష్‌ మీడియంపై మాట్లాడాలి.. జనం ఇంటికి వచ్చి కొడతారు. చంద్రబాబు నీ డ్రామాలు, యాక్షన్‌ 40 ఏళ్ల నుంచి చూస్తున్నారని, నిన్ను నమ్మరు. ఎన్టీఆర్‌కు ఏం చేశావో నీకు అదే జరుగుతుంది. జగన్‌ను మీరందరు కలిసి కూడా ఏమీ చేయలేరు. దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు బ్రోకర్లను పక్కనపెట్టుకొని పార్టీని నడుపుతున్న చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి.. నీ కుక్కలను అన్నింటిని కూడా బోన్లలో వేసి కట్టేసి జాగ్రత్తగా ఉంచుకోవాలి.. వాటిని బయటకు వదిలితే వాటికి దేహశుద్ధి ఉంటుంది.. నీకు కూడా తప్పదు’ అని కొడాలి నాని హెచ్చరించారు.

Get Breaking News Alerts From IndiaGlitz