close
Choose your channels

సుప్రీమ్ హీరో చేతుల మీదుగా సంపూ కొబ్బరిమట్ట టీజర్ రిలీజ్...

Monday, May 23, 2016 • తెలుగు Comments
బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూప‌క్ రొనాల్ట్ స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం కొబ్బ‌రిమ‌ట్ట‌. ఈ చిత్రాన్నికుంబగిరి, సాయి రాజేష్ శీలం సంయుక్తంగా నిర్మించారు. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న కొబ్బ‌రిమ‌ట్ట టీజ‌ర్ ను సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో రిలీజ్ చేసారు.
ఈ సంద‌ర్భంగా నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ...సినిమాకి హైప్ రావాలంటే టీజ‌ర్ సెన్సేష‌న్ అవ్వాలి. అందుక‌నే ఈ టీజ‌ర్ లో సంపూతో ఆడ‌వాళ్ల గురించి లెంగ్తీ డైలాగ్ చెప్పించాం. సినిమాలో మ‌గ‌వాళ్ల గురించి ఇంట‌ర్వెల్ లో మూడు నిమిషాల డైలాగ్ చెబుతాడు. నేను చిరంజీవి గారి ఘ‌రానా మొగుడు సినిమా చూసి డైరెక్ట‌ర్ అవ్వాల‌నుకున్నాను. అందుక‌ని హృద‌య కాలేయం సినిమాలో ఫ‌స్ట్ ఫ్రేమ్ చిరంజీవి గార్కి అంకితం ఇచ్చాను. ఇప్పుడు నా సినిమా టీజ‌ర్ ను మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ వ‌చ్చి రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఖ‌చ్చితంగా హిట్ అవుతుంది. ఈ సినిమా సంపూర్ణేష్ బాబు కెరీర్ కి హెల్ప్ అవుతుంది అన్నారు.
డైరెక్ట‌ర్ రూప‌క్ రొనాల్ట్ స‌న్ మాట్లాడుతూ...టీజ‌ర్ లో చూసిన లెంగ్తీ డైలాగ్ ను షూటింగ్ లాస్ట్ రోజు షూట్ చేసాం. ఈ డైలాగ్ ని సంపూ చెప్పేట‌ప్పుడు చాలా టెన్ష‌న్ ప‌డ్డాం. చివ‌రికీ సంపూ డైలాగ్ క‌రెక్ట్ గా చెప్ప‌డంతో చాలా హ్యాపీగా ఫీల‌య్యాం అన్నారు.
డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ...కొబ్బ‌రిమ‌ట్ట టీజ‌ర్ బాగుంది. ఈ టీజ‌ర్ ఒక సునామిలా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఈ లెంగ్తీ డైలాగ్ తో సంపూర్ణేష్ బాబు రియ‌ల్ పెర్ ఫార్మ‌ర్ అని నిరూపించుకున్నాడు. ఖ‌చ్చితంగా కొబ్బ‌రిమ‌ట్ట బిగ్ హిట్ అవుతుంది. ఈ టీమ్ ని స‌పోర్ట్ చేయ‌డానికి వ‌చ్చిన సాయిధ‌ర‌మ్ తేజ్ కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ...కొబ్బ‌రిమ‌ట్ట టీజ‌ర్ ను సాయ‌న్న‌(సాయిధ‌ర‌మ్ తేజ్) రిలీజ్ చేస్తుంటే మెగాస్టార్ చిరంజీవి గారే రిలీజ్ చేస్తున్నంత ఆనందంగా ఉంది. ఈ చిత్రం అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.
సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ...సంపూర్ణేష్ అంటే నాకు ఇష్టం. మ‌హాత్మ సినిమాలో సంపూ జూనీయ‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించాడ‌ని..ఆత‌ర్వాత ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్ధాయ‌కి వ‌చ్చాడ‌ని తెలుసుకుని చాలా ఇన్ స్పైయిర్ అయ్యాను. లాంగెస్ట్ టీజ‌ర్ ను రిలీజ్ చేసే అవ‌కాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఈ సినిమా ఈ టీమ్ కి మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz