ఏడాదిలోనే వ్యతిరేకత - కిషన్ రెడ్డి


Send us your feedback to audioarticles@vaarta.com


తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో ఏడాది తిరిగేలోపే వ్యతిరేకత వచ్చిందంటున్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ ను అధికారం నుంచి దించడానికి 9 ఏళ్లు పట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఏడాదికే వ్యతిరేకత వచ్చిందన్నారు.
ఇప్పటికిప్పుడు మరోసారి ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు కిషన్ రెడ్డి. 6 గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటివరకు ఆ గ్యారెంటీల ఊసెత్తలేదని విమర్శించారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు గడ్డుకాలమని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల మధ్య తిరగలేని పరిస్థితి వస్తుందంటున్నారు మంత్రి. పేదలకు ఇళ్లు ఇవ్వలేకపోవడం, గ్రామాల్లో రోడ్లు వేయలేకపోవడం, నిరుధ్యోగ భృతి ఇవ్వకపోవడం, జాబ్ క్యాలెండర్ అమలులో వైఫలం లాంటి అంశాలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేస్తాయంటున్నారు.
తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని మోదీపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, దీని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, తమ వైఫల్యాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకోలేదని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com