close
Choose your channels

మ‌రో యంగ్ హీరో జోడీగా కేతికాశ‌ర్మ‌

Friday, August 7, 2020 • తెలుగు Comments

ఢిల్లీ భామ కేతికా శ‌ర్మ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి హీరోగా న‌టిస్తోన్న ‘రొమాంటిక్’లో హీరోయిన్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది వేస‌విలో విడుద‌ల కావాల్సిన ఈ ‘రొమాంటిక్’ చిత్రం ఆగింది. హాట్ హాట్ అందాల‌తో సోష‌ల్ మీడియాలో కుర్ర‌కారు మ‌తులు పొగొట్టే ఈ భామ ‘రొమాంటిక్’ సినిమాపై భారీ ఆశ‌ల‌ను పెట్టుకుంది. ఈ సినిమా విడుదల కాలేదు. కానీ.. ఈ అమ్మ‌డు అందం మాత్రం అవ‌కాశాన్ని తెచ్చి పెట్టింద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తోంది.

వివ‌రాల మేర‌కు నాగ‌శౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందునున్న ఈ కొత్త చిత్రంలో కేతికా శ‌ర్మ‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారని స‌మాచారం. మ‌రి ఈ పాత్ర తీరు తెన్నులెంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో విలువిద్య నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా కోసం నాగ‌శౌర్య ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలుగా శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ మీద సినిమా రూపొందుతోంది. అశ్వథ్థామ త‌ర్వాత నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తోన్న చిత్ర‌మిది.

Get Breaking News Alerts From IndiaGlitz