close
Choose your channels

ఎస్.. బాలయోగి ఆస్తులు కొట్టేశానంటున్న కేశినేని!

Tuesday, July 16, 2019 • తెలుగు Comments

ఎస్.. బాలయోగి ఆస్తులు కొట్టేశానంటున్న కేశినేని!

ఎంపీ కేశినేని నాని.. ఇప్పుడీ పేరు చెబితే తెలుగు తమ్ముళ్లకు చెమటలు పడుతున్నాయ్.. మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో ఈయన ఏమైనా ట్వీటుతారో అని సొంత పార్టీ నేతలు మొదలుకుని అధికార పార్టీ నేతల వరకూ రోజూ ఇదో టెన్షన్. అయితే ఈయన ట్వీట్లకు అటు సొంత పార్టీ నేతలు.. ఇటు అధికార పార్టీకి చెందిన నేతలూ అంతేరీతిలో స్ట్రాంగ్ కౌంటర్లిస్తున్నారు కూడా. ఇక అసలు విషయానికొస్తే.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై వరుస ట్వీట్లు చేస్తూ కేశినేని రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అంతేకాదు.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం ఇరుకున పెట్టేలా కేశినేని ట్వీట్స్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు.

తాజాగా.. మరోసారి ఈ ఇద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా వార్ జరిగింది. ‘దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు.. నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి వినే ధైర్యం నీకుందా?’ అని బుద్దా ట్వీట్ చేయగా.. ఎస్ నేను ‘బాలయోగి కి ఉన్న ఆస్తులు నీతి,నిజాయితీ .విలువలు ,సిద్ధాంతాలు ప్రజల్ల పట్ల అంకితభావం, ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి’ అని కేశినేని కౌంటరిచ్చారు.

బుద్దా వెంకన్న ఏమన్నారు..!?

‘దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నంబర్‌పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా..?. నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి వినే ధైర్యం నీకుందా?. నువ్వు చేసినవన్నీ అభాంఢాలు, నేను చెప్పేవన్నీ నిజాలు. బస్సుల మీద ఫైనాన్స్ తీసుకొని 1997లో సొంతంగా దొంగ రిసిప్ట్‌లు తయారుచేసుకుని ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకొని కోట్లాది రూపాయలకు ఫైనాన్స్ కంపెనీలకు మోసం చేసిన నువ్వా ట్వీట్ చేసేది. బలహీన వర్గాలకి చెందిన నాకు ఎంఎల్ సి పదవి ఇచ్చిన చంద్రబాబు గారికీ విశ్వాస పాత్రుడిని దానికి నువ్వు ఏ పేరు పెట్టినా నాకు ఇష్టమే.. చంద్రబాబు గారి కొసం పార్టీ కోసం ఈ ట్వీట్ల యుద్దం ఆపేస్తున్నాను..’అని బుద్దా వెంకన్న తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

కేశినేని కౌంటర్ ఇదీ..

‘నేను బాలయోగి ఆస్తులు కాజేశనని ఒక్క ప్రబుద్ధుడు చెప్పింది యదార్థం. బాలయోగికి ఉన్న ఆస్తులు నీతి, నిజాయితీ, విలువలు, సిద్ధాంతాలు ప్రజల్ల పట్ల అంకితభావం, ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి వీటిని కాజేసి పాటిస్తునందుకు చాలా గర్వ పడుతున్నాను’ అని బుద్దాకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

ఇకనైనా మార్పు రాదా..!?

ఒకే పార్టీకి చెందిన కీలకనేతలు ఇంతలా ట్విట్టర్ వేదికగా కొట్టుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నా అధిష్టానం మాత్రం తనకేమీ తెలియదన్నట్లుగా మిన్నకుండిపోవడం గమనార్హం. అసలు ఇలా ట్వీట్స్ చేసుకుంటూ ఒకర్ని ఒకరు ఎత్తి చూపుకుంటూ పోవడం వల్ల పైసా ప్రయోజనం ఏమైనా ఉంటుందా..? లేకుంటే దీని వల్ల ఒరిగేదేమైనా ఉందా..? ఇష్టంలేనప్పుడు ఎవరి దారి వారు చూసుకోవాలే తప్ప ఇలా చిల్లర చిల్లర మాటలు మాట్లాడుకుంటూ పార్టీ పరువును గంగలో కలపడం ఏ మాత్రం సబబు కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా బుద్దా వెంకన్న ఇంతటితో తాను ట్వీట్లకు స్వస్తి చెబుతున్నానని చెప్పారు.. ఇక కేశినేని కూడా ఆయన జోలికి పోకుండా.. కష్టకాలంలో, ఫ్యాన్ హవా నడుస్తున్న టైమ్‌లోనూ నమ్మి ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకోసం ఆలోచించి అభివృద్ధి చేస్తే మంచిదేమో!

Get Breaking News Alerts From IndiaGlitz