close
Choose your channels

సౌత్ విల‌క్ష‌ణ న‌టుడితో  క‌త్రినా కైఫ్‌

Tuesday, January 12, 2021 • తెలుగు Comments

సౌత్ విల‌క్ష‌ణ న‌టుడితో  క‌త్రినా కైఫ్‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తిలో జోడీ క‌ట్ట‌నుందంటూ సినీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా స‌ర్‌ప్రైజింగ్ న్యూసే. ఇంత‌కీ విజ‌య్ సేతుప‌తిలో జోడీ క‌ట్టబోతున్న స‌ద‌రు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా? క‌త్రినా కైఫ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు కెరీర్‌లో క‌త్రినా కైఫ్ మూడు ద‌క్షిణాది సినిమాల్లో న‌టించింది. అందులో ఒక‌టి మ‌ల్లీశ్వ‌రి, రెండో సినిమా అల్ల‌రి పిడుగు కాగా.. మూడో సినిమా ఓ మ‌ల‌యాళ చిత్రం. ఇందులో గెస్ట్ అప్పియ‌రెన్స్ మాత్ర‌మే చేసింది. అంటే వెంక‌టేశ్‌, బాల‌కృష్ణ మిన‌హా మ‌రో సౌత్ హీరో స‌ర‌స‌న క‌త్రినా కైఫ్ హీరోయిన్‌గా న‌టించ‌లేదు.

అయితే అన్నీ ప‌క్కాగా కుదిరితే విజ‌య్ సేతుప‌తి ప‌క్క‌న కత్రినా కైఫ్ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాలున్నాయంటున్నారు. వివ‌రాల మేర‌కు బాలీవుడ్‌లో అంధాదున్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ మూవీ తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శ్రీరామ్ రాఘ‌వ‌న్ ఓ భారీ చిత్రాన్ని బాలీవుడ్‌లో ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించ‌నున్నాడు. ఆయ‌న జోడీగా క‌త్రినా కైఫ్‌ను న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది.

Get Breaking News Alerts From IndiaGlitz