కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్న మంత్రి గారి రాసలీలలు..
ఓ మంత్రిగారి రాసలీలలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలకు ప్రతినిధిగా ఉంటూ రక్షించాల్సిన మంత్రే భక్షించాలని చూసిన వైనం కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తనకు ఉపాధి కల్పించాలంటూ కోరిన యువతి జీవితంతో ఆటలాడుకున్న సదరు మంత్రి గారి పాపం పండింది. అసలు వ్యవహారమంతా వీడియోలతో సహా బయటకు వచ్చింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా పెను దుమారాన్నే రేపుతోంది.
అసలు విషయంలోకి వెళితే.. కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జార్కిహోలి దగ్గరకు కొన్ని రోజుల క్రితం ఓ యువతి వచ్చింది. షార్ట్ ఫిలిమ్ విషయమై రమేశ్ జార్కిహోలి సహకారం కోరింది. అయితే ఆమెకు సాయం చేయాల్సింది పోయి ఆ యువతిని ప్రలోభపెట్టారు. కేపీటీసీఎల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నారు. అనంతరం యువతిని లైంగికంగా వేధించారు.
అయితే ఈ వ్యవహారమంతా తాజాగా బయటకు వచ్చింది. బాధిత యువతితో మంత్రి జరిపిన సంభాషణలతో పాటు వీడియో టేపులు సైతం బయటకు వచ్చాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిపక్ష నేతలు రమేశ్ జార్కిహోలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.