close
Choose your channels

నాని చిత్రంలో కన్నడ బ్యూటీ..?

Sunday, October 4, 2020 • తెలుగు Comments

నాని చిత్రంలో కన్నడ బ్యూటీ..?

నేచురల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతున్నారు. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ‘ట‌క్ జ‌గ‌దీష్’ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఈ పాటికి ‘ట‌క్ జ‌గ‌దీష్’ మూవీ పూర్తై ఉండేది. దాదాపు ఆరు నెలల తర్వాత షూటింగ్‌ పునః ప్రారంభం అయ్యింది. దీని తర్వాత నాని నటించబోయే చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. ఈ సినిమాలో నానిలో మూడు షేడ్స్‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడని టాక్ వినిపిస్తోంది. సినిమాలో రెండు ప్రేమ‌క‌థ‌లుంటాయి. నాని స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్స్ న‌టించ‌బోతున్నారు. ఒక హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తుందని టాక్‌ వినిపిస్తోంది. మరో హీరోయిన్‌గా కన్నడ చిత్రసీమకు చెందిన క్రితిశెట్టి నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఉప్పెన చిత్రంలో నటించిన క్రితిశెట్టికి తొలి చిత్రం విడుదల కాకపోయినా, అవకాశాలను అందిపచ్చుకుంటోందట. లేటెస్ట్‌ సమాచారం మేరకు ఈ చిత్రంలో నాని సరసన క్రితిశెట్టి నటించనుందంటున్నారు.

శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాలో రెండు ప్రేమకథలుంటాయి. ఓ ప్రేమ‌క‌థ హైద‌రాబాద్‌లో, మ‌రో ప్రేమ‌క‌థ కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో ర‌న్ అవుతుంది. కోల్‌క‌తా స‌న్నివేశాల‌ను అక్క‌డే చిత్రీక‌రించాల‌ని క‌రోనా వైర‌స్ ప్ర‌భావానికి ముందు అనుకున్నారు. కానీ క‌రోనా రావ‌డం.. ఇంకా ఆ ఎఫెక్ట్ త‌గ్గ‌క‌పోవ‌డంతో ఇప్పుడు కోల్‌క‌తాలో స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డం కంటే.. హైద‌రాబాద్‌లో సెట్ వేసి చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే సెట్ వ‌ర్క్ కూడా ప్రారంభ‌మైందని స‌మాచారం.

Get Breaking News Alerts From IndiaGlitz