close
Choose your channels

ఎస్పీబీకి భార‌త‌రత్న ఇవ్వమ‌ని ప్ర‌ధానికి జ‌గ‌న్ లేఖ‌..క‌మ‌ల్ స్పంద‌న‌

Tuesday, September 29, 2020 • తెలుగు Comments

ఎస్పీబీకి భార‌త‌రత్న ఇవ్వమ‌ని ప్ర‌ధానికి జ‌గ‌న్ లేఖ‌..క‌మ‌ల్ స్పంద‌న‌

శుక్ర‌వారం గాన‌గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌న్నుమూశారు. ఆయ‌న కోట్లాది మంది అభిమానులు దుఃఖంలో మునిగిపోయారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు భార‌త‌రత్న ఇవ్వాలంటూ ఓ లేఖ రాశారు. ప‌దహారు భాష‌లు.. 45 వేల‌కు పైగా పాట‌లు పాడ‌ట‌మంటే ఆషామాషీ విష‌యం కాదు. తెలుగు సినిమా పాట‌ల‌ను ఖండాంత‌రాలు దాటించిన బాలుకి భార‌త‌రత్న ఇవ్వాలంటూ ఆయ‌న అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. హీరో అర్జున్ ఇప్ప‌టికే బాలుకి భార‌తర‌త్న ఇవ్వాలంటూ త‌న గ‌ళాన్ని వినిపించారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు.

ఎస్పీబీకి కేంద్ర ప్ర‌భుత్వం భార‌త‌రత్న ఇవ్వాలంటూ ప్ర‌ధానికి వై.ఎస్‌.జ‌గ‌న్ లేఖ రాయ‌డంపై అగ్ర క‌థానాయ‌కుడు క‌మల్ హాస‌న్ స్పందించారు. ‘‘మ‌న సోద‌రుడు ఎస్‌.పి.బాలసుబ్ర‌హ్మ‌ణ్యంకు భార‌త‌ర‌త్నఅందించాలంటూ మీరు అభ్య‌ర్థించినందుకు గౌరవనీయులైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు. ఇది త‌మిళ‌నాడే కాదు.. యావ‌త్ దేశంలోని ఆయ‌న అభిమానులు కోరిక‌’’ అని తెలిపారు. మ‌రి ప్ర‌ధాని నరేంద్ర మోడీ .. జ‌గ‌న్ లేఖ‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు భార‌త‌ర‌త్న ఇస్తారా? అని చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz