close
Choose your channels

హాస్పిట‌ల్‌లో ప్ర‌ముఖ విల‌న్... క‌మ‌ల్ సాయం

Friday, July 10, 2020 • తెలుగు Comments

హాస్పిట‌ల్‌లో ప్ర‌ముఖ విల‌న్... క‌మ‌ల్ సాయం

పొన్నాంబ‌ళం...ఈ పేరు ఏదో త‌మిళ న‌టుడు క‌దా! అనిపించ‌వ‌చ్చు కానీ.. విల‌న్ క‌బాలి తెలుసా? అంటే వెంట‌నే స‌గ‌టు తెలుగు ప్రేక్ష‌కుడు ఠ‌క్కున గుర్తు ప‌ట్టేస్తాడు. క‌బాలి పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు విల‌న్‌గా సుప‌రిచితుడైన పొన్నాంబ‌ళం తెలుగులో స్ట్ర‌యిట్ సినిమాలు కూడా చేసి మెప్పించాడు. ఒక‌ప్పుడు పొన్నాంబ‌ళం పేరు విల‌న్‌గా మారు మోగింద‌నే చెప్పాలి. ఇప్పుడు  ఈ న‌టుడు అనారోగ్య కార‌ణంగా హాస్పిట‌ల్ పాల‌య్యాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో పొన్నాంబ‌ళం చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్లో చికిత్స తీసుకుంటున్నాడు. విష‌యం తెలుసుకున్న హీరో, పొలిటీషియ‌న్ క‌మ‌ల్ హాస‌న్ ఆర్థిక సాయాన్ని అందిస్తాన‌ని తెలిపారు. పొన్నాంబ‌ళ‌మ్ పిల్ల‌ల చ‌దువు బాధ్య‌త‌ల‌ను త‌నే తీసుకున్నారు క‌మ‌ల్‌హాస‌న్‌.

పొన్నాంబ‌ళం హాస్పిట‌ల్‌లో మాస్కుతో ఉన్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. సినీ అభిమానులు, ప్రేక్ష‌కులు, నెటిజ‌న్లు పొన్నాంబ‌ళం త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నారు. త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్ హోస్ట్ చేసిన త‌మిళ‌ బిగ్‌బాస్ సీజ‌న్‌2లోనూ పొన్నాంబ‌ళం కంటెస్టెంట్‌గానూ పాల్గొన్నారు. 2019లో ఈయ‌న జ‌యం ర‌వి హీరోగా న‌టించిన చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించారు.

Get Breaking News Alerts From IndiaGlitz