close
Choose your channels

40 ఏళ్ల క్రితం టైటిల్‌తో క‌మ‌ల్ హాస‌న్‌..!

Wednesday, October 7, 2020 • తెలుగు Comments

40 ఏళ్ల క్రితం టైటిల్‌తో క‌మ‌ల్ హాస‌న్‌..!

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా `ఖైదీ`తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన లొకేష్ క‌న‌రాజ్ ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌మ‌ల్‌హాస‌న్ 232వ సినిమా ఇది. రాజ్‌క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై క‌మ‌ల్ హాస‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `వ‌న్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్‌డ్ ఎ ఘోస్ట్‌` అనే ట్యాగ్‌లైన్‌తో అనౌన్స్‌మెంట్ చేసిన ఈ చిత్రానికి టైటిల్‌ను ఖ‌రారు చేయ‌లేదు. అయితే ప్రారంభంలో ఈ సినిమాకు `ఎవ‌నెండ్రు నిన్నైతాయి` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఈ లిస్టులో మ‌రో టైటిల్ చేరింది. ‘గురు’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. 40 ఏళ్ల క్రితం ఇదే టైటిల్‌తో క‌మల్‌హాస‌న్ సినిమా చేయ‌డం , అదే టైటిల్ మ‌రోసారి ఆయ‌న సినిమాకే ప‌రిశీల‌న‌లో ఉండ‌టం విశేషం.

యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నిజానికి ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `భార‌తీయుడు 2` సినిమా చేస్తున్న ఈ సమ‌యంలో క‌మ‌ల్ కొత్త సినిమాను అనౌన్స్ చేసింది చూస్తుంటే.. భార‌తీయుడు 2 హోల్డ్‌లో ప‌డిన‌ట్లే అని అంటున్నాయి సినీ వ‌ర్గాలు. మ‌రో ప‌క్క క‌మ‌ల్ హాసన్ బిగ్‌బాస్ సీజ‌న్ 4తో పాటు.. రాజ‌కీయాల్లో బిజీగా ఉంటున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz