close
Choose your channels

త‌మ్ముడు బాట‌లో అన్న‌..!

Monday, January 18, 2021 • తెలుగు Comments

త‌మ్ముడు బాట‌లో అన్న‌..!

సాధార‌ణంగా మన ఇంట్లో పెద్ద‌వారు చిన్న‌వారికి మార్గ‌ద‌ర్శకంగా నిలుస్తుంటారు. కానీ అతి కొద్ది సంద‌ర్భాల్లో మాత్ర‌మే చిన్న‌వారిని పెద్ద వారు అనుక‌రిస్తుంటారు. అలాంటి కొద్ది సంద‌ర్భ‌మే ఇది అనుకోవ‌చ్చా అంటే.. ఏమో చెప్ప‌లేమ‌నే స‌మాధాన‌మే వినిపిస్తుంది. వివ‌రాల్లోకి వెళితే.. నంద‌మూరి న‌ట వార‌సుల్లో మూడో త‌రానికి చెందిన నందమూరి క‌ల్యాణ్‌రామ్ త‌న సోద‌రుడు నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్న‌ట్లు అనిపిస్తుంది. ఇంత‌కీ క‌ల్యాణ్‌రామ్ ఏ విషయంలో తార‌క్‌ను ఫాలో అవుతున్నాడ‌ని అనుకుంటున్నారా? సినిమాల విష‌యంలోనే..

వివ‌రాల్లోకి వెళితే.. నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో రాజేంద్ర అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పాడ‌ట‌. ఇంత‌కీ కొత్త ద‌ర్శ‌కుడితో క‌ల్యాణ్‌రామ్ ఎందుకు ఓకే చెప్పాడో తెలుసా. ఆ సినిమాలో క‌ల్యాణ్‌రామ్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ట‌. అతి కొద్ది మంది హీరోల‌కే త్రిపాత్రాభిన‌యం చేసే అవ‌కాశం ద‌క్కుతుంది. అలాంటి వారిలో నేటి త‌రం హీరోల్లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 2017లో జై ల‌వ‌కుశ చిత్రంలో త్రిపాత్రాభిన‌యం చేశాడు. మూడేళ్ల గ్యాప్‌లో త‌మ్ముడిని ఫాలో అవుతూ క‌ల్యాణ్‌రామ్ త్రిపాత్రాభిన‌యం ఉన్న సినిమాలో న‌టించ‌బోతున్నాడని టాక్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz