ఆగిన జెట్ ఎయిర్వేస్ సర్వీస్.. రోడ్డున పడ్డ వేలాది ఉద్యోగులు
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొన్ని నెలలుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన జెట్ ఎయిర్వేస్ చివరకు అప్పుల ఊబిలో పడటంతో తలొంచేసింది. దీంతో 26 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన ఈ ఎయిర్‌లైన్ దిగ్గజం బుధవారం రాత్రితో తన సర్వీసులను నిలిపివేసింది. అయితే జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిపివేసిన నేపథ్యంలో ఆ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 22,000 మంది భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారింది. ఇందులో 16,000 మంది డైరెక్ట్ ఉద్యోగులు కాగా, మరో 6,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కొత్త కొనుగోలుదారు ముందుకు వస్తేతప్ప జెట్ మళ్లీ పైకి ఎగరే పరిస్థితులు లేవు.
ఉద్యోగులకు నిద్రపట్టట్లేదు..
దీంతో హఠాత్తుగా జెట్ ఎయిర్వేస్ ఆగిపోవడంతో ఉద్యోగులకు ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. "ఏం చేయాలో తెలియక రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు.. మా కుటుంబాలను ఆదుకోండి.. 50 ఏండ్ల వయసులో నేనెక్కడికి వెళ్లి ఉద్యోగం వెతుక్కోవాలి" అని జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఎటూ కదల్లేని విమానాలు.. మరోవైపు ఎక్కడికి వెళ్ళాలో తెలియని సిబ్బంది.. ఇంకోవైపు ఏం చెప్పాలో తోచని యాజమాన్యం.. పరిస్థితి అల్లకల్లోల్లంగా మారిపోయింది!. పాతికేండ్లకుపైగా దేశీయ విమానయాన రంగంలో సేవలందించిన జెట్ ఎయిర్వేస్ సంస్థలోని ప్రస్తుత పరిస్థితిది.
ఉద్యోగుల ఆవేదన ఇది...
ఇదిలా ఉంటే జెట్ ఆగిపోవడంతో రోడ్డున పడ్డ ఉద్యోగుల ఆవేదన అంతా ఇంతా కాదు.. ఒక్కొక్కరు వారి గాథ చెబుతుంటే అది విన్న మీడియా మిత్రులకు కూడా కంటతడి ఆగలేదు! పిల్లలను బడికి పంపాడనికి డబ్బుల్లేవ్ అని ఒకరు.. ఆస్పత్రికి వెళ్లడానికి డబ్బుల్లేవని ఇంకొకరు ఇలా అప్పులు చేసి వైద్యం చేయించుకున్నామని.. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియట్లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. జెట్స్‌లో ఉద్యోగం వచ్చిన తర్వాత ఎన్నో కలలు కన్నానని.. అందంతా మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయిందని ఓ ఉద్యోగి కంటతడి పెట్టాడు. మా కుటుంబ సభ్యులను ఎలా పోషించాలి..? భవిష్యత్తు అగ్యమగోచరంగా ఉందని మరో మహిళా ఉద్యోగి చెబుతోంది. ఇలా ఎవర్ని కదిలించినా కంటతడే తప్ప.. మరొకటి లేదు. అయితే ఫైనల్‌గా జెట్ ఎయిర్వేస్ ఈ ఉద్యోగులందరి మార్గం చూపిస్తుందా..? లేకుంటే చేతులెత్తేస్తుందా? అనేది తెలియాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments